టాలీవుడ్ ఫ్యామిలీ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా మొదటి సారిగా తెలుగు లో సాయిపల్లవి నటించింది.  అచ్చమైన తెలంగాణ యాస మాట్లాడుతూ.. భానుమతి..హైబ్రీడ్ పిల్లా, 'బాడ్కావ్ బలిసిందారా... బొక్కలిరగ్గొడతా' అంటూ ఓ వ్యక్తిని తిడుతుంది..ఆమె చెప్పిన డైలాగులు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఈ మూవీలో సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. దీనికి తోడు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుకు ప్రేక్షకులు నిజంగా ఫిదా అయ్యారు.  ఈ మూవీలో మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే... అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  

 

ఈ పాటని మధుప్రియ పాడగా, ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ రాశారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించాడు. ఎక్కడ ఈవేంట్స్ జరిగినా.. ప్రతి పెళ్లి కార్యక్రమాల్లో ఈ పాట మారుమోగింది.  ఈ పాట మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్ ఇండియన్ సినిమా ఇండ‌స్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుల మోత మోగించింది. ఈ రికార్డ్ అందుకోవాలంటే మ‌ళ్లీ ఎన్నాళ్లు ప‌డుతుందో అనుకున్నారు కానీ సాయిప‌ల్ల‌వే వ‌చ్చి ఓన్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టేసింది.  ధనుష్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా మారి 2 అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని రౌడీబేబీ అనే పాట ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డుల మీదా రికార్డులను బద్దలు కొడుతుంది.

 

ఏకంగా 183 మిలియ‌న్ వ్యూస్ ని అందుకుని యూట్యూబ్‌లో స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది. కేవ‌లం 11 నెలల్లోనే 725 మిలియ‌న్ వ్యూస్ అందుకుని ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా రికార్డులన్నీ తన పేరు రాసుకుంది. ఈ పాటకు డ్యాన్స్ కూడా ప్రత్యేకంగా నిలిచింది.  ధనుష్ రాసి, ఆలపించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీని అందించారు. కాగా, ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డుల్లో 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది.  మొత్తానికి ఈ రౌడీబేబీ దెబ్బకు ఇప్పుడు ఫిదా పాట ఫ‌స‌క్ అయ్యిందన్న మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: