తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్, రొమాంటిక్ డ్రామా సరిలేరు నీకెవ్వరూ చిత్రం సంక్రాంతి కానుకగా మన ముందుకి వస్తుంది. దూకుడు, ఆగాడు తరువాత మహేష్ బాబు తిరిగి మాస్ సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండటానికి ప్రధాన కారణం కూడా అదే. మహేష్ బాబు నటన విషయంలో తిరుగులేదు  కాని గొప్ప డ్యాన్స్ చేసే వ్యక్తి కాదని చాలా సార్లు విమర్శలు ఎదురుకున్నారు.

 

మహేష్ బాబు డ్యాన్స్ విషయంలో కొంచెం మైనస్ అని అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది, స్పైడర్ సినిమాలో వేసిన స్టెప్స్ కి మహేష్ బాబుని నెటిజన్లు  కనికరం లేకుండా ట్రోల్ చేశారు. కానీ అనిల్ రావిపూడి మహేష్ బాబులో దాచిన ప్రతిభను కొత్తగా కనుగొన్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరూలో మహేష్ బాబు నృత్యం ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటిగా ఉంటుందని చెప్పారు ఆయన.

 

తాజా సమాచారం ప్రకారం, సరిలేరు నీకెవ్వరూ పాటలలో మహేష్ బాబు డాన్స్ ఖచ్చితంగా అతని అభిమానులను అలాగే మాస్ సినీ ప్రేమికులను ఆనందపరుస్తాయి అని చెప్తున్నారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌ కంపోజ్ చేసిన డాన్స్ స్టెప్స్  మహేష్ బాబు సులభంగా చేసారు అని చెప్తున్నారు.

 

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి టీజర్ వచ్చినప్పటి నుంచి మహేష్ బాబు ఫాన్స్ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపుడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరూ టీజర్ విడుదలైనప్పటి నుండి దానికి  అద్భుతమైన స్పందన లభించింది. అలాగే నిర్మాతలకి బాలీవుడ్ పంపిణీదారుల నుండి కాల్స్ వస్తున్నట్లు సమాచారం, మహేష్ బాబు నటించిన ఈ సినిమా హిందీలో కూడా విడుదల చేయాలని వారు కోరినట్లు తెలుస్తుంది. ఈ మధ్యే బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ తనకి మహేష్ బాబుతో నటించాలని ఉంది అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: