ఇంతకు ముందు తరంలో టాలీవుడ్లో రొమాంటిక్ హీరో ఎవరు అంటే కచ్చితంగా శోభన్ బాబు పేరు వినిపిస్తుంది. అందుకే ఆయనకి సోగ్గాడు అనే బిరుదు కూడా వచ్చింది. ఆయన ఎన్నో రొమాంటిక్ సినిమాలలో నటించారు, అందులో చాలా సినిమాలు మంచి విషయాలు సాధించాయి. అలనాటి హీరోయిన్ అయిన తమిళనాడు సీఎం జయలలిత ప్రేమించారని  గుసగుసలు వినిపించాయి. కానీ వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు, దానితో మనస్తాపానికి గురైన జయలలిత జీవితాంతం కూడా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు అని అంటూ వుంటారు.

 

  ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే మన టాలీవుడ్ " రౌడీ స్టార్" విజయ్ దేవరకొండ అలనాటి సోగ్గాడు శోభన్ బాబు పాత్రలో కనిపించనున్నాడట. తమిళనాడు మాజీ  సీఎం జయలలిత జీవితాన్ని ఆధారం చేసుకుని కంగనా రనౌత్ నటిస్తున్న "అమ్మ" అనే చిత్రంలో శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారని తెలుస్తుంది.

 

ఈ చిత్రం తమిళంలో "తలైవి" పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జయలలిత జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన శోభన్ బాబు పాత్ర కోసం విజయ్ దేవరకొండ తీసుకోని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ, దీనిపై యూనిట్ వర్గాలు ఎటువంటి అధికారం ప్రకటన చేయలేదు. అలాగే ఇంకో వార్త కూడా గట్టిగా వినిపిస్తోంది.

 

జయలలిత ఆత్మ బంధువు గా పిలవబడే శశికళ పాత్రలో అందాల తార ప్రియమణి నటించబోతున్నారని వార్తలు గట్టిగా వస్తున్నాయి. దీనిపై కూడా పూర్తిగా స్పష్టత రాలేదు, ఇటీవల విడుదలైన మొదటి లుక్ గురించి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరైతే అసలు కంగనా రనౌత్ జయలలిత పాత్రలో ఎలా సరిపోతుంది అనుకున్నారని ప్రేక్షకులు కొద్దిగా గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తమిళంలో పాటు తెలుగు ,హిందీ భాషల్లో కూడా విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: