ప్రముఖ సినిమా సింగర్ పై ఓ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.. మామూలుగానే నోటి దురద ఉన్న ఆ కమెడియన్ ఎప్పుడు ఇండస్ట్రీలో నీ ఎవరోకరిని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటాడు.. దానికి సీరియస్ అయిన ఆ సింగర్ నోటికి పనిచెప్పింది దీనివల్ల ఆయన మొండి వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది...అసలు ఇంతకీ ఏమైంది ఎందుకు అతను సారి చెప్పే వరకు వెళ్ళాడు అన్న విషయానికొస్తే..

 


దిల్‌బర్‌' సింగర్‌ ఫేమ్‌, ఇండియన్‌ ఐడల్‌ షో జడ్జి నేహా కక్కర్‌ ఎత్తు, టాలెంట్‌పై విమర్శలు చేసిన కమెడియన్‌ స్టార్‌ గౌరవ్‌ గేరా క్షమాపణలు చెప్పాడు. ఓ కామెడీ షోలో భాగంగా పొట్టిగా ఉన్న అమ్మాయికి నేహా కక్కర్‌గా పేర్కొన్న గౌరవ్‌... నేహా పాడిన పాటలను సైతం ప్రస్తావించాడు. ఈ విషయంపై నేహా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గౌరవ్‌ మాట్లాడుతూ.. తను చేసిన వ్యాఖ్యలకు నేహా ఈ స్థాయిలో బాధపడుతుందని ఊహించలేదన్నాడు. 

 


తాను నేహకు పెద్ద అభిమానినని తెలిపాడు. ఆమె ఒక గొప్ప ప్రతిభావంతురాలని కొనియాడాడు. నేహ టాలెంట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ప్రశంసలు కురిపించాడు.నేహను దాదాపుగా మూడుకోట్ల మంది ఫాలోవర్స్ ఫాలో అవ్వడం బట్టి చూస్తే అర్థమవతుంది అంటూ కొనియాడారు.. కాగా నేహాను కించపరుస్తున్నట్లుగా గౌరవ్‌ మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది.

 


ఇకపోతే ఆ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయ ఛానెల్ తొలగించిన కూడా అప్పటికే చాలా మంది చూడటంతో ఆమె అభిమానులు అతనిపై మండిపడుతున్నారు..దీంతో గౌరవ్‌ వివరణ ఇచ్చుకున్నాడు. నేహా దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చిందని తెలిపారు. తాను అసలు ఎత్తు గురించి పట్టించుకోనని.. అసలు నా ఎత్తు కూడా నాకు తెలియదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ వీడియోకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: