ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ 70 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారి మెగా, నందమూరి ఫ్యామిలీ ల హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంటే, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఎప్పటినుండో తెలుగు సినిమాలో నటించాలని ఉందని ఇటీవల కొన్ని ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చిన ఆలియా, ఆ కల ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా నెరవేరుతుండడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ఆలియా ఇటీవల తన సొంత యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ లో తన లైఫ్ స్టైల్ మరియు పర్సనల్ విషయాలను ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది. ఇకపోతే నేడు ఆమె ఒక ఆసక్తికర వీడియోని పోస్ట్ చేసింది. అదేమిటంటే, 

 

తనకు ఇష్టమైన రెండు వంటలను తన పర్సనల్ అసిస్టెంట్స్ ద్వారా నేర్చుకుని మరీ తన ఫ్యాన్స్ కి చేసి చూపించింది ఆలియా. ఇక ఈ వీడియో ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకోవడం జరిగింది. ఇక ఈ వీడియోని చూసిన ఆమె ఫ్యాన్స్, ఆలియా మంచి అందగత్తె మాత్రమే కాదు కుక్ కూడా అంటూ సరదాగా ఆమెపై తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేయండి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: