ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. స్టాండప్ కామెడీ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది పటాస్ కామెడీ షో. అంతేకాదు సరి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొత్త కొత్త కమెడియన్స్  అందరికీ లైఫ్ ఇస్తూ ఉంటుంది పటాస్ కామెడీ షో. అయితే ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ కామెడీ షో ఒక రేంజ్లో పాపులారిటీ సంపాదించింది. అయితే పటాస్ షో అంతగా పాపులర్ అవ్వడానికి కారణం పటాస్ లోకి వచ్చిన కమెడియన్స్ అందరు  ఒక రేంజ్ లో స్టాండప్ కామెడీ చేస్తూ నవ్వించడమే కాకుండా... మరోవైపు రవి శ్రీముఖి కెమిస్ట్రీ కూడా పటాస్ షో క్రేజ్ ఎక్కడికో పెరిగి పోయేలా చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కాస్త ప్రేక్షకులందరికీ నచ్చడంతో పటాస్ షో తెగ చూసేవారు తెలుగు ప్రేక్షకులు. 

 

 

 

 ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు పంచులు వేస్తూ నవ్వులు పంచే వారు రవి శ్రీముఖి. అయితే శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందు పటాస్ షో  నుంచి శ్రీముఖి తప్పుకుంటున్నట్లు ఓ  వీడియో ద్వారా తెలిపింది శ్రీముఖి . ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అక్కడ తనదైన శైలిలో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తుంది అనుకున్న శ్రీముఖి కొద్దిలో మిస్సై రన్నరప్గా నిలిచింది. అయితేనేం బిగ్ బాస్ షో ద్వారా బాగానే రెమ్యూనరేషన్ సంపాదించింది ఈ అమ్మడు. అయితే బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి పటాస్ షో లో రీ ఎంట్రీ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారిన  విషయం తెలిసిందే. 

 

 

 

 బిగ్ బాస్  హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత  ఓ ఇంటర్వ్యూ పటాస్ షో లో కి మళ్లీ రిప్లై ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు... పటాస్ షో  లోకి వెళ్లి రవితో యాంకరింగ్ చేయడానికి మన నాన్న పర్మిషన్ ఇవ్వాలి అంటూ శ్రీముఖి చెప్పడం సంచలనం గా మారిపోయింది. దీంతో పటాస్ షో లో రవి ఉండడంవల్ల శ్రీముఖి రీ ఎంట్రీ ఇవ్వడం లేదు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా పటాస్ షో నుంచి యాంకర్ రవి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి కొత్తగా చలాకి చంటి హోస్ట్ గా వచ్చాడు. దీంతో మరోసారి శ్రీముఖి పటాస్ షో లో కి రి ఎంట్రీ  చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక చలాకి చంటి తో శ్రీముఖి మంచి రాపో కూడా ఉండడంతో ఈ జంట పటాస్ ను బాగా అలరించగలరు   అని మల్లెమాల యాజమాన్యం భావిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: