సంక్రాంతికి వస్తాడు అనుకున్న వెంకీ మామ ముందుగానే వచ్చేశాడు. వెంకీ మామ ట్రైలర్ చూస్తే అబ్బా అన్ని రుచులు కలిసిన సినిమా ఇది అని అనిపిస్తుంది. అంతా అద్భుతంగా సినిమా ట్రైలర్ ఉంది. మామగా విక్టరీ వెంకటేష్ అదరగొట్టగా అల్లుడిగా నాగ చైతన్య ఈ సినిమాలో అదరగొడుతున్నాడు. ఇంకా మామ వెంకీ పక్కన పాయల్ రాజపుత్, అల్లుడు నాగచైతన్య పక్క రాశి ఖన్నా కథానాయకలాగా నటిస్తున్నారు. 

                           

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఖమ్మంలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌లో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో వెంకటేశ్ యాక్షన్, కామెడీ టైమింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటు మేనల్లుడితో బంధాలు, బంధుత్వం కూడా అలరిస్తోంది. 

               

అల్లుడి కోసం మామ దేశ సరిహద్దుల్లో.. మామ కోసం అల్లుడు గ్రామంలో చేసే పోరాటాలు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా మామ అల్లుళ్ల ప్రేమ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఈ ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు యాక్షన్, కామెడీ, లవ్, రాజకీయాలతో పాటు సరిహద్దులను కూడా చిత్రీకరించారు. 

 

అయితే ఈ చిత్రంలో వెంకటేశ్ రైతుగా, నాగచైతన్య ఆర్మీ ఉద్యోగిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో రావురమేశ్, నాజర్, ప్రకాశ్‌రాజ్ అలరించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌లో నిర్మితమైన ఈ సినిమాను సురేశ్ బాబు నిర్మించారు. కాగా ఈ సినిమాకు దర్శకుడు బాబీ దర్శకత్వం వహించారు. కాగా ఈ నెల 13వ తేదీన 'వెంకీమామ' చిత్రం విడుదలకానుంది. మరి ఈ సినిమా ఎంతమంది ప్రేక్షకులకు దగ్గర అవుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: