నిన్న సాయంత్రం ‘వెంకీ మామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఖమ్మంలో అత్యంత ఘనంగా జరిగింది. వేలాదిమంది జనం ఈ ఈవెంట్ కు రావడం చూసిన వారు వెంకటేష్ కు యూత్ లో ఇంత క్రేజ్ ఉందా అంటూ ఆశ్చర్యపోయారు. ఈ ఫంక్షన్ లో ‘కోకో కోలా పెప్సీ’ పాటకు వెంకటేష్ నాగచైతన్య రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ రాశీ ఖన్నా లతో కలిపి స్టేజ్ పై వేసిన మాస్ స్టెప్స్ కు పులకరించి పోయారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఈ మూవీ విడుదల తరువాత తనను విక్టరీ వేకటేశ్ గా కాకుండా ‘వెంకీ మామ’ వెంకటేష్ గా పిలుస్తారు అంటూ ఈ మూవీ పై మరింత అంచనాలు పెంచాడు. అంతేకాదు తన చేతులలో పెరిగిన నాగచైతన్యతో కలిసి తను మాస్ స్టెప్స్ వేయడం తనకు ఊహించని విషయంగా మారింది అంటూ చైతూ పై తన అభిమానాన్ని వ్యక్త పరిచాడు. 

ఈ సందర్భంలో నిన్న విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కు కూడ మంచి స్పందన వస్తోంది. యంగ్ జనరేషన్స్ కు నచ్చే చైతూ రొమాన్స్ ఫ్యామిలీలకు నచ్చే వెంకీ లవ్ అనుబంధాలు ఎమోషన్లు వీటన్నింటి మధ్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్లు పక్కాగా జోడించి ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అన్న సంకేతాలు ఈ ట్రైలర్ ద్వారా ఇచ్చారు. 


ఈమధ్య గత కొన్ని వారాలుగా వస్తున్న చిన్న సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో ఒక మంచి సినిమాకోసం ప్రేక్షకులు చాల ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఈ గ్యాప్ ను కార్నర్ చేస్తూ ‘వెంకీ మామ’ ఈవారం రాబోతోంది. ఈ సినిమా అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే సంక్రాంతి సినిమాలు విడుదల అయ్యేదాకా ‘వెంకీ మామ’ హంగామా కొనసాగే ఆస్కారం ఉంది ఇదే జరిగితే జనవరిలో ‘ఎఫ్ 2’ ఈ ఏడాది మొదలుపెట్టిన వెంకటేష్ ‘వెంకీ మామ’ తో ఇదే సంవత్సరం మరొక హిట్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి తాను యంగ్ హీరోలకు అన్ని విషయాలలోను పోటీ ఇవ్వగలను అన్న సంకేతాలు ఇచ్చాడనుకోవాలి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: