టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని గురించి తెలియని వారు ఉండరు. సమంత  ఏ విషయాన్ని అయినా డేర్ అండ్ డాషింగ్ గా ఓపెన్ గా చెప్పేస్తుంది. ఎలాంటి మ్యాటర్ అయినా కుండబద్దలు కొట్టినట్లు చెబుంద‌న్న విష‌యం తెలిసిందే. `ఏమాయ చేశావే` సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌మైన ఈ బ్యూటీ కెరియ‌ర్‌లో మంచి మంచి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంటూ పోతుంది. కథా ప్రాధాన్యముండే సినిమాల్లో నటిస్తూ.. ప్రతి సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరువవుతోంది. మొదట్లో ఉన్న పట్టుదలనే కొనసాగిస్తూ.. తెగువ గల కథానాయికగా దూసుకుపోతోంది. కేవలం నటనతోనే కాదు.. తన ఫిట్‌నెస్‌‌తో పాటు అందంతోనూ అమ్మాయిలందరికీ స్ఫూర్తినిచ్చే నాయికగా మారింది. 

 

మ‌రోవైపు నాగ చైత‌న్య‌తో ఎనిమిదేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో వివాహ బంధంతో ఒక్కటైంది. ఇక పెళ్లి తర్వాత కూడా అదే అందంతో తెలుగు సినిమా హీరోయిన్లకు ఫ్యాష‌న్ ఐకాన్‌గా మారింది స‌మంత. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తూ త‌న గ్లామ‌ర్‌తో మ‌తి పోగొడుతూ వస్తున్న ఈ భామ.  అయితే తాజాగా క్రేష్ బజాజ్ ఈవెంట్‌కు వచ్చిన సమంతను చూసి అభిమానులు షాక్ అయ్యారు. అమ్మె స‌మంత ఏంటి ఇలా అయింది.. నిజంగానే అక్కడున్నది సమంతనా కాదా అనే అనుమానం కూడా వచ్చింది వాళ్లకు. అదే పనిగా చూస్తే కానీ అక్కడున్నది సమంత అక్కినేని అని ఎవరికీ అర్థం కాలేదు. 

 

ముఖ్యంగా ట్రెండ్ ఫాలో కావడంలో కూడా సమంత ముందుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. అక్కినేని అభిమానులకు షాక్ ఇస్తూ మరో కొత్త రూపంలోకి మారిపోయింది స్యామ్. కాగా,  ఫ్యాషన్ పేరుతో మన హీరోయిన్లు ఎలా మారిపోతున్నారో చెప్పడం కూడా ఎవరి తరం కావడం లేదు. అందంగా ఉన్న వాళ్లే మేకప్ పేరుతో విచిత్రంగా మారిపోతుంటారు. అదే ప‌ని స‌మంత చేయ‌డంలో.. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇక ప్ర‌స్తుతం 96 రీమేక్‌లో శర్వానంద్‌కు జోడీగా నటిస్తుంది. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఒరిజినల్ డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఇక్కడా దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: