చిరంజీవి కొరటాల శివ మూవీ కథ దేవాలయాల భూముల మాఫియా నేపధ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఫైనల్ కావడంతో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మొన్న శుక్రువారం ప్రారంభం అయిన బాలకృష్ణ బోయపాటిల కథ కూడ ప్రస్తుతం ఒక సామాజిక సమస్యగా మారిన దేవాలయ భూముల అన్యాక్రాంతం సమస్య చుట్టూ తిరుగుతుంది అని లీకులు రావడం ఆశ్చర్యంగా మారింది. 

దీనితో ఇంచుమించు ఒకే కథతో చిరంజీవి బాలయ్యల సినిమాలు ఉండబోతున్నాయా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఈ లీకులు రావడంతో కథ విషయంలో బాలయ్య సినిమాలో మార్పులు చేస్తారా లేదంటే సినిమాలో మార్పులు చేస్తారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే ఒకే మూల కథతో రెండు భారీ సినిమాలు నిర్మాణం జరుపుకుంటే ఈ రెండు సినిమాలలో ఏ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుని ముందుగా విడుదల అయితే ఆ మూవీకి పరిస్థితులు అనుకూలిస్తాయి. అయితే అదే కథతో మరో సినిమా లేట్ గా వస్తే అది టాప్ హీరోల భారీ సినిమా అయి నప్పటికీ ప్రేక్షకులు పట్టించుకోరు. 

ఇలాంటి పరిస్థితులలో అనుకోకుండా బాలయ్య చిరంజీవి సినిమాల మధ్య పోటీ ఏర్పడి వీరిద్దరి సినిమాలలో ఏ సినిమా ముందు విడుదల అవుతుంది అన్న అనవసరపు పోటీ ఏర్పడిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే చిరంజీవి సినిమాలో పెద్దగా క్రేజ్ లేని త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉంటే బాలయ్య సినిమాలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ మూవీకి హీరోయిన్ గా ఎంపిక అయింది అని వస్తున్న వార్తలు షాకింగ్ గా మారి బాలయ్య అభిమానులకు జోష్ ను పెంచుతున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: