నిన్నటిరోజున జరిగిన ‘వెంకీ మామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రెచ్చిపోయి స్టేజ్ పై వెంకటేష్ చిందులు చూసిన వారు చాలామంది ఆశ్చర్యపడ్డారు. వెంకటేష్ ఇప్పటి వరకు తన సినిమాలకు సంబంధించి ఏఫంక్షన్ లోను చేయనంత హడావిడి చేయడం చూసినవారు ‘వెంకీ మామ’ ఉత్సాహం వెనుకకారణం ఏమిటి అన్నకోణంలో లోతైన విశ్లేషణలు జరుగుతున్నాయి. 

సాధారణంగా మన టాప్ హీరోలు సినిమా ఫంక్షన్స్ వేదికల పై తమ అభిమానులకు జోష్ ను కలిగిస్తూ హుషారుగా మాట్లాడుతారు కాని డాన్స్ లు చేయరు. అయితే బాలీవుడ్ టాప్ హీరోలు మాత్రం తమ సినిమాల ప్రమోషన్ విషయంలో జనం మధ్య డాన్స్ లు చేయడం ఒక పరిపాటి. ఇప్పుడు ఆపద్ధతిని అనుసరిస్తూ ‘వెంకీ మామ’ ప్రమోషన్ లో బాలీవుడ్ తరహాలో ప్రచారం చేస్తున్నారా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ఇది చాలదు అన్నట్లుగా వెంకటేష్ నాగచైతన్యలు హీరోయిన్స్ కలిసి కొన్ని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లి అక్కడ యూత్ తో హడావిడి చేస్తూ అక్కడ కూడ ‘వెంకీ మామ’ ప్రమోషన్ చేయబోతున్నట్లు టాక్. అయితే ఈమూవీ యూనిట్ ఆశ్చర్యకరంగా తమ వ్యూహాలు మార్చి ఏప్రముఖ దిన పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఎక్కువగా జనం మధ్య ఈమూవీని ప్రమోట్ చేస్తున్న వ్యూహాల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈమూవీ బడ్జెట్ 40 కోట్లకు చేరిపోవడంతో ఈ మూవీకి వచ్చే భారీ ఓపెనింగ్స్ బట్టి ఈమూవీ ఆర్ధికంగా లాభపడే ఆస్కారం ఉంది అన్న మాటలు విపిస్తున్నాయి. 

దీనికితోడు ఈమూవీని సురేశ్ బాబు చెప్పిన భారీ రేట్లకు చాలామంది బయ్యర్లు కొనని నేపధ్యంలో సురేశ్ బాబు సొంతంగా ఈమూవీని విడుదల చేస్తున్నారు. ‘వెంకీ మామ’ ను తరుముకు వస్తూ బాలయ్య ‘రూలర్’ సాయి తేజ్ ‘ప్రతిరోజు పండగే’ సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’ ఈ నెల 20న విడుదల అవుతున్న పరిస్థితులలో ఏది చేసినా ‘వెంకీ మామ’ కు వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి ఇలా బాలీవుడ్ తరహాలో ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: