ప్రస్థుతం బాలకృష్ణకు ఒక భారీ హిట్ కావాలి. ఆ హిట్ కోసం బాలయ్య తనకు అనేకసార్లు కలిసివచ్చిన పోలీసు పాత్రను నమ్ముకుంటున్నాడు. ఈనెల 20న విడుదల కాబోతున్న ‘రూలర్’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే గత కాలానికి చెందిన ఫ్యాక్షన్ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. 

దర్శకుడు కె.ఎస్. రవికుమార్ బాలయ్యను ఎలివేట్ చేయడానికి అతడిలోని ఆవేశాన్ని బయట పెట్టడానికి ఒక భారీ కథను అనేక ట్విస్ట్ లతో అల్లినట్లు ఈ ట్రైలర్ చూసిన వారికి అర్ధం అవుతోంది. బీహార్ బ్యాక్ డ్రాప్ లో వ్వవహారాలు. రైతుల సమస్యలు ఇలా రకరకాల అంశాలతో పాటు సీనియర్ యాక్టర్స్ సుహాసినీ జయసుధ ప్రకాష్ రాజ్ లు బాలయ్యకు ఒక హిట్ ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నాన్ని గట్టిగానే చేసినట్లు ఈ ట్రైలర్ చూసిన వారికి అనిపిస్తోంది. 

అయితే ఈమూవీలో బాలయ్య గెటప్ గురించి శ్రద్ధ తీసుకున్న ఈ మూవీ దర్శకుడు బాలయ్య విగ్గుల గురించి ఎందుకు పట్టించుకోలేదో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. బాలయ్య గెటప్ లో న్యూ లుక్ కనిపిస్తున్నా అతడికి ఉపయోగించిన విగ్ లలో ఎటువంటి న్యూ లుక్ లేకపోగా పాత విగ్గులను తీసుకు వచ్చి బాలయ్యకు పెట్టినట్లు కనిపిస్తోంది. 

దీనితో ఈ ట్రైలర్ లోని బాలయ్య విగ్గుల పై అప్పుడే ట్రోలింగ్ మొదలైపోయింది. ప్రస్తుతం ఎలాంటి నటుడుని అయినా చాల అందంగా చూపించే గ్రాఫిక్ వర్క్స్ అందుబాటులోకి వచ్చినా దర్శకుడు రవి కుమార్ ఈ విషయమై ఎందుకు శ్రద్ధ పెట్టలేదు అంటూ బాలయ్య అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఒకనాటి రౌడీ పోలీసు అవతారంలో ఉండే హీరోల సినిమాలను ప్రస్తుత తరం ప్రేక్షకులు ఆసక్తి కనపరచడం లేదు. ఇలాంటి పరిస్థితులలో తన సంక్రాంతి సెంటిమెంట్ ను వదులుకుని క్రిస్మస్ ను నమ్ముకుని వస్తున్న బాలయ్య పై సగటు ప్రేక్షకుడు ఎలాంటి తీర్పు ఇస్తాడో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: