టాలివుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల మార్కెట్ భారీగా పెరిగింది. డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ భారీగా పెర‌గ‌డంతో నిర్మాత‌ల‌కు అద‌న‌పు లాభాలు భారీగా వ‌స్తున్నాయి. అటు త‌మిళ నాడు, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌తో పాటు హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ద్వారా కూడా నిర్మాత‌ల‌కు భారీగా లాభాలు వ‌స్తున్నాయి. దీంతో అటు స్టార్ హీరోల‌కు భారీగా రెమ్యున‌రేష‌న్లు ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. స్టార్ హీరోలు సైతం నిర్మాత‌ల‌కు భారీ లాభాలు వ‌స్తుండ‌డంతో త‌మ రేట్ల‌ను విప‌రీతంగా పెంచేశారు.

 

తమ సినిమాలతో నిర్మాతలు అంత సంపాదిస్తున్నప్పుడు..? తాము కూడా లాభాల్లో వాటాలు అడగాలని భావిస్తున్నారు. వీరిలో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్క‌ల్స్ లో బాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హేష్ బాబు మార్కెట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇటీవ‌ల ఇత‌ర భాష‌ల్లోనూ మ‌హేష్ సినిమాల‌కు రైట్స్‌, డిజిట‌ల్ రైట్స్ ద్వారా మంచి డ‌బ్బులు వ‌స్తున్నాయి.

 

ఈ క్ర‌మంలోనే మ‌హేష్ ఇటీవ‌ల సినిమాల బిజినెస్ విష‌యాల్లో కూడా ఎంట‌ర్ అవుతున్న‌ట్టు టాక్‌.. ?  త‌న‌కు పారితోషకం వద్దని వసూళ్లతో తనకు సంబంధం లేదని... పైన వచ్చేవి తనకు కావాలని అంటున్నాడట. మ‌హ‌ర్షి సినిమా విష‌యంలో కూడా మ‌హేష్ పారితోష‌కం తీసుకోలేద‌న్న టాక్ వ‌చ్చింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట. దీంతో ఆయనకు శాటిలైట్‌తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్, ఆడియో తదితర హక్కులన్నీ కలిపి దాదాపు రూ.45 కోట్ల వరకూ వచ్చాయని టాక్‌.

 

ఇక ఇప్పుడు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు కూడా అలాగే రు.52 కోట్లు ద‌క్కించుకున్నాడ‌ట‌. మ‌హేష్ పెడుతోన్న ఈ రూల్స్‌తో ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత‌లు మ‌హేష్‌తో సినిమా చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్నార‌ట‌. మ‌నోడికే నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ వెళ్లిపోతే ఇక త‌మ‌కు ఏం మిగులుతుంద‌ని వారు వాపోతున్నార‌ట‌. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఈ విష‌యం బాగా హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: