భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి స్థానం ప్రత్యేకమైనది. అప్పటి వరకు ఇండియన్ తెరమీద చుడని అద్భుత ప్రపంచాన్ని సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన సినిమా బాహుబలి. సినిమా వచ్చి చాలా రోజులవుతున్నా ఇప్పటికీ దాని ప్రభావం ఇండియన్ సినిమాపై ఉందంటే బాహుబలి ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.

 

అలాంటి సినిమా చేసిన రాజమౌళిని ఎంత పొగిడినా తక్కువే. అయితే బాహుబలి సినిమా తర్వాతి నుండి ప్రతీ దర్శకుడి కల దాన్ని బీట్ చేయాలనే. బాలీవుడ్ లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఒక ప్రాంతీయ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీసును కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ప్రయత్నం మేమెందుకు చేయకూడదు అనుకున్నారో ఏమో, బాహుబలి తర్వాత బాలీవుడ్ లో చాలా సినిమాలు బాహుబలి తరహాలో వచ్చాయి.

 

అయితే అవేమీ బాహుబలిని బీట్ చేయలేకపోయాయి. బీట్ చేయడం అటుంచితే కనీసం దరి దాపుల్లోకి కూడా రాలేకపోయాయి. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, కళంక్ లాంటి భారి చిత్రాలు బాహుబలిని బీట్ చేద్దామనే లక్ష్యంతో వచ్చినవే. కానీ అవి అంత దూరం వెళ్లలేక పోయాయి. అయితే ప్రస్తుతం అశుతోష్ గొవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన "పానిపట్" చిత్రమ్ కూడా ఆ కోవలోకి చెందినదే.

 

అయితే ఈ సినిమా కూడా బాహుబలిని బీట్ చేయలేకపోయింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పానిపట్ యుద్ధం ఆధారంగా అతను తీసిన 'పానిపట్' గురించి ఓ వర్గం విమర్శకులు పాజిటివ్‌గా మాట్లాడారు. దీన్ని ఒక క్లాసిక్‌ లాగా అభివర్ణించారు. అదే సమయంలో కొందరు క్రిటిక్స్ మాత్రం ఇది బోరింగ్ మూవీ అని.. మూడు గంటల పాటు ఈ సినిమాను భరించడం సామాన్య ప్రేక్షకుడికి కష్టమే అని అంటున్నారు. అంటే ఈ సినిమా కూడా బాహుబలిని చేరలేదన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: