యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న రూలర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. బాలయ్య అంటే దబిడి దిబిడే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతా భారీ సెట్టింగులు... హంగామా, ఫైట్లు, డైలాగులు, పంచ్ లు అంతా హడావిడి వ్యవహారం ఉంటుంది. 2.17 నిమిషాల పాటు ఉన్న రూలర్ సినిమా ట్రైలర్ చూస్తూనే ఈ విషయం అర్థమైంది.
ఇక ట్రైలర్లో బాలయ్య చెప్పిన డైలాగులు మాత్రం అదిరి పోతున్నాయి. బాలయ్య ఫ్యాన్స్‌కు, మాస్ కు మాత్రం మంచి విందు భోజనంలా రూలర్ ఉంటుందన్నది క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమా కోసం కేఎస్ రవికుమార్ చాలా పెద్ద భారీ కథనే అల్లినట్టు ట్రైలర్ చెప్పేస్తోంది. ఓ వైపు బిహార్ బ్యాక్ డ్రాప్, మరో వైపు రైతుల సమస్యలు... విలన్లు..పంచ్‌లు, సుహాసిని, జయసుధ, ప్రకాష్ రాజ్, ఇలా ఎందరు నటీనటులతో ట్రైలర్ బాగానే ఉంది.
కామెడీ, ఎమోషన్ కూడా వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది. అన్నీ బాగానే ఉన్నా ఈ సినిమా ట్రైలర్లో కొన్ని మైనస్‌లు కూడా కనిపిస్తున్నాయి. బాలయ్య వీటిని ఎలా మేనేజ్ చేస్తాడో ? చూడాలి. ఊచకోత గానే ఉంది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూడడం జనం తగ్గించేశారు. మరి ఇది ఎలా ? వర్కవుట్ అవుతుందో ? చూడాలి.
వయసు మీద పడిన బాలయ్యకు విగ్ లు సరిగ్గా సూట్ కావడం లేదు. ట్రయిలర్ లో రెండో గెటప్ విగ చూస్తుంటే అంతగా నొప్పలేదు. ట్రైలర్లో ఏదో రెండు నిమిషాలు సీజ వర్క్ చేసే బాలయ్య గెటప్‌ను మేనేజ్ చేయడం వేరు... సినిమా అంతా సీజీ వర్క్ చేయడం వేరు. ఇక ఏజ్ బాలయ్య పక్కన కుర్ర హీరోయిన్లు సోనాల్ చౌహాన్, వేదిక ఎలా సెట్ ? అవుతారో ? కూడా చూడాలి. ఈ నెల 20న రిలీజ్ అవుతోన్న రూలర్‌కు సీ కళ్యాణ్ నిర్మాత.