టాలీవుడ్ అగ్ర‌న‌టుల్లో ఒక‌రైన నంద‌మూరి బాల‌కృష్ణ స‌రికొత్త రోల్ పోషించేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే తెర‌మీద కాదండోయ్‌...తెర‌వెనుక‌... ఇన్నాళ్లు మ‌నం బాల‌య్య‌ను సినిమా హీరోగానే చూశాం. కానీ ఆయ‌న ఇప్పుడు నిర్మాత‌గా మారిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కీ ఏ సినిమాకు ఆయ‌న నిర్మాత అన్న‌దే క‌దా మీ ఆస‌క్తిక‌ర క్వ‌శ్చ‌న్‌... బోయ‌పాటి-బాల‌య్య  కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బాల‌య్య కూడా స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

 

అయితే ఈ సినిమాలో ఎక్క‌డా ఆయ‌న డ‌బ్బులు పెట్ట‌రు. అయితే రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా కేవ‌లం లాభాల్లో మాత్ర‌మే వాటా తీసుకుంటార‌న్న మాట‌. అయితే సినిమాలో ఆయ‌న పేరు స‌హ నిర్మాత‌గా పేర్కొంటారా లేదా అన్న‌ది కూడా ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కంగా మారింది.  రెమ్యూరేష‌న్ తీసుకోకుండా కేవ‌లం లాభాల్లో వాటా మాత్ర‌మే తీసుకునే ట్రెండ్ అటు బాలీవుడ్‌..త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌లో ఎప్ప‌ట్నుంచో కొన‌సాగుతోంది. ర‌జ‌నీకాంత్ చాలా సినిమాల‌కు ఇలానే లాభాలు ద‌క్కించుకోవ‌డం జ‌రుగుతోంది.

 

రోబో సినిమాకు ఆయ‌న‌కు ఏకంగా 50కోట్ల‌కు పైగానే ముట్టిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో బాల‌య్య ఈ ట్రెండును మొద‌లు పెట్టార‌న్న మాట‌. మొత్తానికి బాల‌య్య స‌రికొత్త ట్రెండుకు నాంది ప‌లికారు. ఇదిలా ఉండ‌గా ఈ ట్రెండు నిర్మాత‌ల‌కు ఆర్థిక భారాల‌ను త‌ప్పిస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అంతేకాక హీరో క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ‌గా ఉండ‌టంతో సినిమా విజ‌యావ‌కాశాలు మెరుగుప‌డుతాయ‌ని, సినిమా ప్ర‌మోష‌న్‌కు, విడుద‌ల అనంత‌రం ప‌ర్య‌ట‌న‌ల‌తో కలెక్ష‌న్లు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.

 

ఇదిలా ఉండ‌గా  ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకునేందుకు బోయపాటి ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా ఆమె మాత్రం కొంచెం టాలీవుడ్ సినిమాల్లో టించేందుకువిముఖ‌త‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  రీసెంట్ గా సైరాలో  నయన్ కంటే తమన్నాకే  ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డంతో తెలుగు సినిమాల‌పై అమ్మడు కినుక వంహించిద‌ని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: