నిజ జీవితంలో మామ అల్లుళ్లయినా విక్టరీ వెంకటేష్నాగ చైతన్య కలిసి రీల్ లైఫ్ లో కూడా మామ అల్లుడుగా చేసిన సినిమా ‘వెంకీ మామ’. కేఎస్‌. ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఊరించి ఊరించి.. ఎన్నో వాయిదాలు ప‌డి ఎట్ట‌కేల‌కు డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

 

వెంకటేష్నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. నిర్మాత సురేష్ బాబు సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువుగా బ‌డ్జెట్ అవ్వ‌డంతో ఈ సినిమాను సోలోగా రిలీజ్ చేసేందుకు చాలా రోజులు వెయిట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా కంప్లీట్ అయ్యింది. ఆంధ్ర – తెలంగాణ పరంగా సుమారు 27 కోట్లకి అమ్ముడైంది.

 

ఇక రెస్టాఫ్ ఇండియా పరంగా 2.8 కోట్లకి అమ్ముడు పోగా, ఓవర్సీస్ రైట్స్ 3 కోట్లకి అమ్ముడు పోయాయి.
సుమారు వరల్డ్ వైడ్ 33 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రు.35 కోట్ల షేర్ రాబ‌ట్టాలి. ఇక హిట్ అయ్యి.. బ‌య్య‌ర్లు లాభాల్లోకి రావాలంటు రు.40 కోట్ల షేర్ రావాలి. వాస్త‌వంగా చూస్తే వెంకీ, చైతు మార్కెట్ ను బ‌ట్టి చూస్తే ఇది కాస్త పెద్ద ఫిగ‌రే అయినా సినిమాకు హిట్ టాక్ వ‌స్తే ఇది పెద్ద టార్గెట్ కాదు. ఏరియాల వారీగా  వెంకీ మామ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

 

‘వెంకీ మామ’ ప్రీ రిలీజ్ బిజినెస్:

 

నైజాం –   7.6 కోట్లు

 

ఆంధ్ర –  13.8 కోట్లు

 

సీడెడ్ –     5.5 కోట్లు

 

ఆంధ్ర – తెలంగాణ మొత్తం – 26.9 కోట్లు

 

రెస్ట్ అఫ్ ఇండియా –   2.8 కోట్లు

 

ఓవర్సీస్    –   3 కోట్లు
--------------------------------------------------------------
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ టోటల్ – 32.7 కోట్లు
--------------------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: