టాలీవుడ్‌లో గ‌త నాలుగు నెల‌లుగా కళ తప్పిన థియేటర్లు మరో వారం నుండి కళకళలాడనున్నాయి. ఇప్పటిదాకా చిన్న సినిమాలతో జనాలు లేక వెలవెలబోయిన థియేటర్లు ఇక మ‌రో రెండు, మూడు నెల‌ల పాటు వ‌రుస‌గా ఆస‌క్తిక‌ర సినిమాల‌తో క‌ళ‌క‌ళ లాడిపోనున్నాయి. ముందుగా డిసెంబర్ 13న వెంకీ మామ రిలీజ్ తో సినిమాల జాతరకు తెరలేవనుంది. అంత‌కంటే ఒక రోజు ముందుగానే వ‌ర్మ అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమా రానుంది.

 

ఇక వెంకీ మామ విష‌యానికి వ‌స్తే నిజ జీవితంలో మామ అల్లుడుగా ఉన్న వెంకటేష్, నాగ చైతన్య తొలిసారి కలిసి పూర్తి స్థాయిలో నటిస్తోన్న వెంకీ మామ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పోటీగా సినిమాలు ఏవీ లేకపోవడంతో ఒక వారం పాటు వెంకీ మామదే హవా. ఈ సినిమా వ‌చ్చిన వారానికే మ‌రోస‌టి వారం నంద‌మూరి బాల‌య్య రంగంలోకి దిగుతున్నాడు. డిసెంబర్ 20న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ప్రతిరోజూ పండగే, బాల‌య్య రూలర్ అదే రోజున విడుదల కానున్నాయి.

 

ఈ రెండు సినిమాలు ఆయా వ‌ర్గాల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌రుచుకున్నాయి. ఇక అదే రోజున కార్తీ నటించిన దొంగ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్‌గా ఖైదీ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ దొంగ‌పై సైతం మంచి అంచ‌నాలే ఉన్నాయి. జ్యోతిక, కార్తీ కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం. దృశ్యం సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు.

 

ఇక డిసెంబ‌ర్ 25న రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే వ‌స్తోందిది. దిల్ రాజు నిర్మాణం కావడంతో అంచనాలు బాగున్నాయి. ఇక కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా మైత్రి మూవీస్ వారు తెరకెక్కించిన మత్తు వదలరా కూడా ఇదే రోజున రానుంది. ఇక జ‌న‌వ‌రి నెలంతా పెద్ద సినిమాల సంద‌డే ఉండ‌నుంది.  ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్‌, అల్లు అర్జున్ అల వైకుంఠ‌పురంలో, మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు, క‌ళ్యాణ్‌రామ్ ఎంత మంచివాడ‌వురా సినిమాలు రానున్నాయి. ఫిబ్ర‌వ‌రిలోనూ భారీ అంచ‌నాలు ఉన్న సినిమాలు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: