దేశమంతా హాట్ టాపిక్ అయిన దిశా ఘటనపై అందరు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. దిశా నిందితులను ఎన్ కౌంటర్ పై ప్రజలంతా వాళ్లకు సరైన శిక్ష పడ్డదని అన్నారు. అయితే కొందరు మాత్రం ఇలా చంపుకుంటూ పొతే ఎలా.. అందరిని ఇలా ఎన్ కౌంటర్ చేయడం కుదరదు కదా అని అంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇక మీదట జరుగకుండా అందరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

 

ఈ ఘటనపై కొందరు ప్రజలు మగవాళ్ళు ఇలా ఆలోచించడానికి సినిమాలు కూడా ఒక కారణం అని చెబుతున్నారు. దిశ లాంటి ఘటనలు జరిగేందుకు సినిమాలు సహకరిస్తున్నాయా అంటే విలనిజం చూపించే క్రమంలో దర్శకులు వారిని క్రూరంగా చూపిస్తున్నారు. అప్పుడు అమ్మాయిల మీద అఘాయిత్యాలు అందులో చూపిస్తున్నారు. అవి చూసే కొందరు ఇలా మూర్ఖంగా తయారవుతున్నారు అంటున్నారు.

 

అయితే సినిమాలో మంచి కూడా ఉంటుంది మరి ఎందుకు వాటిని అందరు పాటించారు అంటే.. మంచి కన్నా చెడుకే తొందరగా ఎట్రాక్ట్ అవుతారు అందుకే మర్డర్, రేప్ సీన్స్ సినిమాలో చూసి బయట అలా చేస్తున్నారు. అయితే కచ్చితంగా సినిమాల వల్లే ఇలా జరుగుతుంది అని కూడా చెప్పడం కరెక్ట్ కాదు. సినిమాలో చాలా విషయాలు ఉంటాయి వాటిని కాకుండా ఇలాంటి ఫాలో అయితే తగిన గుణపాటం జరుగుతంది.

 

ఇక మీదట సినిమాల్లో మర్డర్, రేప్ సీన్స్ కూడా చేస్తే బెటర్ అని కొందరు అంటున్న మాట. ఒక విధంగా ఆలోచిస్తే అది కరెక్టే అని అనిపిస్తుంది. సినిమాలో అలాంటివి చూపించకుండా ఉంటే మంచిది అంతేకాదు అలాంటి వారికి వేసే శిక్షలను ఇంకాస్త భయకరంగా చూపిస్తే ఇలా మీదట ఎవరు ఆడవాళ్ళను ముట్టుకోవాలన్నా సరే వణుకు పుట్టేలా చేయొచ్చు. సినిమాల ప్రభావం సమాజం మీద.. మనుషుల మీద ఉంటే.. మర్డర్లు, రేప్ సీన్స్ లు ఉండే సినిమాల కన్నా మంచి మెసేజ్ వచ్చే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. మరి వాటిని ఎందుకు జనాలు ఫాలో అవరు చెప్పండి. ఒకరికి ఒకలా  అర్ధమయ్యే సినిమా మరొకరికి మరోలా అర్ధమవుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: