టాలీవుడ్ నటి శ్రీరెడ్డి అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. శ్రీ రెడ్డి ఏ చిన్న మాట  మాట్లాడిన అదో పెద్ద వివాదంగా మారిపోతుంది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది శ్రీ రెడ్డి. అయితే షాద్ నగర్ లో అమాయకపు వైద్యురాలు దిశను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై  ఇప్పటివరకు శ్రీ రెడ్డి మాత్రం స్పందించలేదు. అయితే శ్రీరెడ్డి ఎప్పుడు స్పందిస్తోంద నెటిజన్లు  కూడా బాగానే ఎదురు చూస్తున్నారు.కాగా తాజాగా ఓ  వీడియో ద్వారా దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై స్పందించింది శ్రీరెడ్డి . ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది ఈ అమ్మడు. ఇక ఎన్కౌంటర్ చేసి చంపిన పోలీసులకు సలామ్  చెప్పింది. 

 

 ఈ రోజు కనీసం అమ్మాయిలు సొసైటీలో ధైర్యంగా తిరగలేక పోతున్నారు  అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ అమ్మడు. ఈ సందర్భంగా తనకు చిన్నప్పటి నుంచి ఎదురైన పలు లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. తన సొంత బంధువులే తనను లైంగికంగా వేధించారని అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనకు చదువు చెప్పే టీచర్ నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని... తాను వర్క్ చేసిన ప్లేస్ లో కూడా ఎంతోమంది లైంగికంగా వేధించారని తన బాధను వెళ్లగక్కుతున్నారు. వాళ్లంతా లైంగిక వేధింపులకు పాల్పడుతూ తాకరాని  చోట్ల అసభ్యంగా తాకారని... ఎంతో ఇబ్బంది పెట్టారని శ్రీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. 

 

 అయితే బార్డర్లో ఆర్మీకి  ఇచ్చినట్లుగానే పోలీసులకు కూడా హక్కులు ఇవ్వాలంటూ... చిన్నపిల్లలపై మహిళలపై అత్యాచారాలు చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసేలా హక్కు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థించింది శ్రీ రెడ్డి. అయితే దిశా  కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం పై తాను చాలా హ్యాపీగా ఉన్నాను అని తెలిపింది .. ప్రతి ఘటనలో అమ్మాయిలను బ్లేమ్  చేయడం సరైంది కాదు అంటూ శ్రీరెడ్డి  తెలిపింది . అయితే అమ్మాయిలకు కూడా లిమిట్స్ తెలుసు అని ... పబ్ కి  వెళ్ళకూడదు తాగకూడదు అని చెప్పడానికి మీరు ఎవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది . అయితే చెడు అలవాట్లు  లేని మహిళలు 50% వున్నారని... మరి వాళ్ళ పై కూడా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి అంటూ ప్రశ్నించింది. ముందు మగాళ్ళ  మైండ్ సెట్ మారకపోతే సమాజం ఎలా  బాగుపడుతుంది అంటూ ప్రశ్నించింది . కాగా ప్రస్తుతం శ్రీరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: