యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ట లేటెస్ట్ సినిమా రూల‌ర్‌. కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఇప్ప‌టికే స్టిల్స్‌, లుక్స్‌, టీజ‌ర్స్‌తో బాల‌య్య మార్క్ సినిమాగా ప్ర‌శంస‌లు పొందుతోంది. ఇక ఆదివారం రూల‌ర్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సోష‌ల్ మీడియాలో దూసుకు పోతోంది. ఈ రూల‌ర్ ట్రైల‌ర్ గురించి బాలయ్య అల్లుడు అయిన నారా లోకేష్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.



మామ రూల‌ర్ ట్రైల‌ర్ ను లోకేష్ ఆకాశానికి ఎత్తేశాడు. బాల‌య్య డైలాగుల‌తో పాటు బాల‌య్య న‌ట‌న అదుర్స్ అంటూ మెచ్చుకున్నారు. లోకేష్ పెట్టిన ట్వీట్ చూస్తే "ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?" బాలా మావయ్యా!మీ డైలాగ్ సూపర్. టోటల్ గా మీ సినిమా 'రూలర్' ట్రైలర్ అదుర్స్.దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్యా అని లోకేష్ పోస్ట్ చేశాడు.



లోకేష్ అటు రాజ‌కీయాల్లో ఎంత బిజీగా ఉన్నా త‌న మామ బాల‌య్య సినిమాల టీజ‌ర్లు, ట్రైల‌ర్లు న‌చ్చిన‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ ఉంటుంటాడు. గ‌తంలో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, మ‌హానాయ‌కుడు, క‌థానాయ‌కుడు సినిమాల విష‌యంలో కూడా లోకేష్ త‌న సోష‌ల్ మీడియాలో స్పందించాడు. ఇక ఇప్పుడు రూల‌ర్ సినిమా ట్రైల‌ర్‌పై సైతం త‌న అభిప్రాయం చెప్పాడు.



ఇక రూల‌ర్ ట్రైల‌ర్ డైలాగులు లోకేష్‌ను మాత్ర‌మే కాకుండా ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. ఇది దెబ్బతిన్న సింహాంరా.. అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది పంచ్ డైలాగ్ కూడా బాగా పేలింది. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. ఈ నెల 20న సినిమా రిలీజ్ అవుతోంది. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై కేఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌రి బాల‌య్య బాక్సాఫీస్ ను ఎలా రూల్ చేస్తాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: