నందమూరి బాలయ్య బాబు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో నటించిన ‘రూలర్’ సినిమా ట్రైలర్ అదరగొట్టే రేంజ్ లో ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ కావడంతో ‘రూలర్’ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా నందమూరి అభిమానులను అలరించాలని హిట్ కొట్టాలని భావించి గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమాలో అదరగొట్టే కొత్త లుక్ లో బాలయ్య బాబు ఉండటంతో సినిమాకి సంబంధించి విడుదలైన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో రావడంతో కచ్చితంగా ‘రూలర్’ సినిమా బాలయ్య కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని బాలయ్య గెటప్ చూసి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

 

ఇటువంటి తరుణంలో తాజాగా ఈ రోజు ‘రూలర్’ ట్రైలర్ సినిమా యూనిట్ విడుదల చేయడంతో ట్రైలర్లో బాలయ్య బాబు చెప్పిన డైలాగులు మరియు యాక్షన్ సీన్స్ చూసి నందమూరి అభిమానులు కచ్చితంగా ఇది 2019 సంవత్సరంలో చివరి నెలలో వస్తున్న ఈ సినిమా 2019 సంవత్సరానికి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోతుందని బాలయ్య అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్లు మీద కామెంట్లు చేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో తాజాగా ఈ ‘రూలర్’ ట్రైలర్ పై బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్లో ఈ విధంగా కామెంట్ పెట్టారు... “ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా? అంటూ బాలయ్య డైలాగ్‌ను పోస్ట్ చేస్తూ బాలా మావయ్యా!” మీ డైలాగ్ సూపర్. టోటల్ గా మీ సినిమా రూలర్ ట్రైలర్ అదుర్స్. దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది అంటూ బాలా మావయ్యకు ట్విట్టర్‌లో ఆల్ ద బెస్ట్ చెప్పారు. దీంతో నారా లోకేష్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: