పాటించేవాడికే పద్ధతులు గానీ, వదిలేసినోడికి ఏం పట్టదు. కల్కి కొచ్లిన్ కూడా ఇలాగే ఉంది. పెళ్లికి ముందే తల్లవుతోన్న కల్కి, బోల్డ్ అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడుతోంది. పెళ్లి గురించి వింత వింతగా మాట్లాడుతోంది. 

 

కల్కి కొచ్లిన్ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎక్కడైనా ఓపెన్ గా బిహేవ్ చేస్తుంది. అంతా నా ఇష్టం అన్నట్టు లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ బోల్డ్ నెస్ తోనే పెళ్లికి ముందే తల్లవుతోంది కల్కి. బాయ్ ఫ్రెండ్ ఇజ్రాయిల్ ఆర్టిస్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ గయి హార్స్ బర్గ్ తో రిలేషన్ లో ఉన్న కల్కి, రింగులు మార్చుకోకముందే బేబీకి ఉయ్యాల సిద్ధం చేసింది. 

 

కల్కి రెండేళ్ల నుంచి హార్స్ బర్గ్ తో రిలేషన్ లో ఉంది. ఈ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. మరి పెళ్లికి ముందే తల్లవుతున్నారు. బిడ్డ పుట్టాక పెళ్లి చేసుకుంటారా.. అని ఎవరైనా అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇస్తోంది. పెళ్లి చేసుకోకుండా అమ్మనాన్న అవ్వకూడదా..?  ఇద్దరు మనుషులు కలవడానికి మనసులు కలిస్తే చాలు. అంతేగానీ సమాజం కోసం పెళ్లి చేసుకోను అని క్లాస్ తీసుకుంటోంది. 

 

బేబీ పుట్టాక బర్త్ సర్టిఫికెట్స్ తీసుకునేటప్పుడు గానీ.. స్కూల్లో జాయిన్ చేసే టైంలో గానీ పేరెంట్స్ ప్రస్తావన ఉంటే అప్పుడు ఆలోచిస్తాం. అంతవరకు ఈ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తానని చెబుతోంది కల్కి. ఇక ఈమె చెబుతోన్న ఈ ఆన్సర్స్ ని విని బాలీవుడ్ జనాలంతా ఆశ్చర్యపోతున్నారు. కల్కి ఇంత బోల్డ్ గా మారిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి కల్కి పెళ్లికాకముందే ఓ బిడ్డకు తల్లవుతోంది. సమాజం ఏమనుకున్నా డోంట్ కేర్ అంటోంది.  చూడాలి ముందు ముందు ఏమి జరుగుతుందో..!

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: