రాంగోపాల్ వర్మ నిర్మించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీ ఎన్నో వివాదాలు ఎదుర్కొని చివరకు సినిమా పేరునే మార్చుకునే పరిస్థితి తెచ్చుకుంది. వర్మ సినిమాకు సెన్సార్ బోర్డు చురకలంటించింది. దీనితో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కాస్తా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు గా పేరు ను మార్చారు రాంగోపాల్ వర్మ. 

 

ఇక ఇదే నేపథ్యంలో వర్మ సినిమాపై కేఏ పాల్ "ఇది వివాదాస్పద చిత్రం" అని పేర్కొన్నారు. సినిమా విడుదలను ఆపాలంటూ హైకోర్టు లో సైతం పిటిషన్ వేశారు. దీనితో వర్మకు కేఏ పాల్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా సెన్సార్ బోర్డు వర్మ సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

 

ఇక వర్మ తన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో తనదైన శైలిలో స్పందించారు. తన సినిమాకు వ్యతిరేకంగా హై కోర్ట్ లో పిటిషన్ వేసిన కేఏ పాల్ ఫోటో ను మార్ఫింగ్ చేసి తనకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లుగా ఒక ఫోటో ను సృష్టించి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇక మార్ఫింగ్ ఫోటోను సృష్టించి తన సినిమాపై వ్యతిరేకంగా హై కోర్టు లో పిటిషన్ వేసిన కేఏ పాల్ పై కౌంటర్ ఇచ్చి వర్మ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు అని నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇంతకు ముందు, ఈ సినిమా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల నిజ జీవిత పాత్రలని పోలి ఉందని, సినిమా విడుదలకు అనుమతిస్తే వారిని అవమానించినట్లు ఉంటుందని హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి హై కోర్టు లో పిటిషన్ వేశారు. ఆది నుంచి ఎన్నో వివాదాలు దాటుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: