బాలయ్య అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్ రూల‌ర్ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్‌లో బాల‌య్య వివిధ గెట‌ప్‌ల‌లో క‌నిపిస్తున్నారు. రూలర్ సినిమాకు తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను  డిసెంబర్‌ 20 ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు చిత్ర వ‌ర్గాలు కృషి చేస్తున్నాయి.  ప్రతీ ఏడాది సంక్రాంతి బరిలో సత్తా చాటే బాలయ్య ఈ సారి  సంక్రాంతికి ముందే సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

 

ఇందుకు థియేట‌ర్ల కొర‌త లేకుండా చూసుకోవాల‌న్న‌ది కూడా ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే ప్రేక్ష‌కుల నుంచి భిన్న‌మైన అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి.2 నిముషాల ప‌దిహేను సెక‌నుల ట్రైల‌ర్ నిడివిలో నిముషం వ‌ర‌కు కూడా బాల‌య్య డైలాగు లేక‌పోవ‌డం అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేస్తోంద‌ట‌. భారీ డైలాగుల‌కు బాల‌య్య పెట్టింది పేరు.

 

డైలాగ్‌తో మొద‌ల‌వ్వాల్సిన ట్రైల‌ర్‌లో నిముషం వ‌ర‌కు డైలాగ్ పెట్ట‌క‌పోవ‌డం ఏమిట‌ని అభిమానులు పెద‌వి విరుస్తున్నార‌ట‌. టీజర్ కు కొనసాగింపుగా ఉన్న ఈ ట్రయిలర్ చూస్తే  అభిమానుల‌కు ఎన్నో అనుమానాలు క‌లుగుతున్నాయ‌ట‌. బాల‌య్య గెట‌ప్‌ల విష‌యంలో ఎప్పుడూ ఫెయిల్  కాలేద‌ని గుర్తు చేస్తున్నారు. కానీ బాల‌య్య‌కు పెద్ద‌గా సూట్ అవ్వ‌ని రెండు గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌డంతో బాల‌య్య అభిమానుల్లో కాస్త భ‌యం ప‌ట్టుకుంటోందంట‌. బాల‌య్య అనేక విభిన్న వేషాధార‌ణ‌ల్లో క‌నిపించి మెప్పించారు.

 

పౌర‌ణిక‌, ఆధ్యాత్మిక‌, ఫ్యాక్ష‌న్ హీరోగా, ఇన్‌స్పెక్ట‌ర్‌గా, నిప్పుర‌వ్వ‌లో కార్మికుడిగా..కూలీగా ఇలా ఎన్నెన్నో పాత్ర‌ల‌తో అభిమానుల మ‌న‌సు దోచుకున్నారు. అయితే రూలర్ టీజ‌ర్‌లో క‌న‌బ‌డుతున్న గెట‌ప్‌లో వ‌చ్చిన గ‌త సినిమాలు ప్లాప్ అయ్యాయ‌ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నార‌ట‌. అయితే చిత్ర వ‌ర్గాలు మాత్రం సినిమా భారీ హిట్టును సొంతం చేసుకుంటుద‌నే న‌మ్మ‌కంతో ఉందంట‌.

 

బాల‌కృష్ణ అభిమానులు కోరుకుంటున్న అన్ని ఎలిమెట్స్‌ను సినిమాలో పొందుప‌ర‌చ‌డం జ‌రిగింద‌ని చెబుతున్నారు.  సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి, జైసింహా సినిమాలకు పనిచేసిన సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: