ఫాన్స్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ వేరు... బహుశా అలంటి అభిమానులు ఏ హీరోకి ఉండకపోవచ్చు. పవన్ అంటే ఊగిపోవడం ఆయన కూర్చున్నా నుంచున్నా దాన్ని ఒక స్టైల్ గా భావించి ఆయన్ను కీర్తించడం చేస్తున్నారు. రాజకీయంగా ఆయన తీసుకునే నిర్ణయాలు జనం తిట్టినా... వాళ్ళు మాత్రం మా దేవుడు ఏది చేసినా సరే దానికి ఒక అర్ధం ఉంది అంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇటీవల దిశ అత్యాచార నిందితులను కాల్చి చంపితే వాళ్ళు వెయ్యి కొబ్బరి కాయలు పవన్ కళ్యాణ్ కి కొట్టారు అంటే పరిస్థితి ఎలా ఆందో చెప్పొచ్చు.

 

ఇప్పుడు ఈ మనస్తత్వమే ఆయనకు సినిమా రంగంలో ఇబ్బందికరంగా మారింది. పవన్ తో సినిమా కోసం మంచి కథ సిద్దం చేసుకున్నా సరే అభిమానుల కారణంగా కొందరు దర్శకులు భయపడే పరిస్థితి ఏర్పడింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు అట్టర్ ఫ్లాప్  అయ్యాయి. ఈ సమయంలో మూడు సినిమాల దర్శకులను... పచ్చిబూతులు సోషల్ మీడియా వేదికగా తిట్టారు.

 

గబ్బర్ సింగ్ దర్శకుడు బాబిని అయితే... ఎన్టీఆర్ తో కుమ్మక్కు అయి సినిమా ఫ్లాప్ చేసాడని ఆ తర్వాత జై లవకుశ తో ఎన్టీఆర్ తో హిట్ కొట్టాడని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక అది పక్కన పెడితే త్రివిక్రమ్ శ్రీనివాస్... ఎన్టీఆర్ తో సినిమా కోసం... అజ్ఞాతవాసి సినిమాను ఎలా పడితే అలా తీశాడని అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందని ప‌వ‌న్ అభిమానులు త్రివిక్ర‌మ్‌ను టార్గెట్ గా చేసుకుని మండిప‌డ్డారు.

 

ఇదే ఇప్పుడు ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌నుకునే ద‌ర్శ‌కుల భవిష్యత్తుని ఇబ్బంది పెడుతుంది... ఆయనతో సినిమా చెయ్యాలి అంటే చాలు నిర్మాతలు, దర్శకులు ఈ ట్రోలింగ్, ఈ రిస్క్ మాకెందుకురా ?  బాబు అనే ప‌రిస్థితి వ‌చ్చేసింది. మ‌రి ఇలాంటి విష‌యాల్లో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్ప‌ట‌కీ అయినా మార‌తారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: