ఫ్లాపులొచ్చినా తట్టుకోగలరేమో గానీ.. సినిమా హిట్టో, ఫ్లాపో తెలియకపోతేనే చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఈ సిట్యుయేషన్ ని డీల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మేచూమేన్ జాన్ అబ్రహాం ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఫలితం లేని పరీక్ష రాసినట్టు మేచూమేన్ తెగ బాధపడుతున్నాడట జాన్. 

 

జాన్ అబ్రహాం ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. హీరో కమ్ ప్రొడ్యూసర్ గా చాలా కష్టపడుతున్నాడు. కానీ ఏడాదికి రెండు మూడు సినిమాల వస్తోన్నా.. సరైన హిట్ మాత్రం రావట్లేదు. కానీ బోనస్ గా నిరాశ నిస్పృహలొస్తున్నాయి. ఎలాంటి కథ పట్టుకున్నా కొలాప్స్ అవుతుందనే బాధ పెరుగుతోంది. 

 

బాలీవుడ్ లో ఈ మధ్య వైవిధ్యమైన కథలకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. దీంతో జాన్ అబ్రహాం కూడా కమర్షియల్ ఫార్మాట్ ని పక్కనపెట్టేశాడు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. పరమాణు, బాట్లా హౌస్ లాంటి కథల్లో నటించాడు. కానీ  ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. 

 

నాలుగైదేళ్లుగా జాన్ అబ్రహాం సరైన సక్సెస్ లేక చాలా డల్ అయ్యాడు. మార్కెట్ కూడా జాన్ సినిమాలకు మునుపటిలా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. దీంతో ఈ హీరో రేంజ్ పడిపోతోంది. టాప్ రేస్ కు దగ్గరగా ఉండాల్సిన వాడు కాస్తా, మీడియం రేంజ్ హీరోల లిస్ట్ లో లాస్ట్ లో ఉంటున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే చిన్న హీరోల స్థాయికి పడిపోయే ప్రమాదముందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. మొత్తాని జాన్ అబ్రహాంకు బ్యాడ్ టైం నడుస్తోంది. సరైన సినిమాలు లేక పాపం అయోమయంలో పడిపోయాడు. ఈ సిట్యువేషన్ ఇలానే కొనసాగితే ఏంటని ఆయనలో ఒకింత ఆందోళన నెలకొంది. చూడాలి భవిష్యత్ ఉంటుందో..!

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: