ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సరైన సక్సెస్ లేకపోతే చాలా కష్టం. టెక్నీషియన్స్ కు అయితే ఫ్లాప్ పడితే అంతే సంగతులు. ప్రకాశ్ కోవెలమూడి ఇలానే వరుస ఫ్లాపులతో డేంజర్ జోన్ లో పడ్డాడు. దీంతో సినిమాలే వదిలేస్తున్నాడట ప్రకాశ్. 

 

దర్శకుడు రాఘవేంద్రరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ప్రకాశ్ కోవెలమూడి. యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని తీసుకున్నాడు. మెగాఫోన్ పట్టి, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు తీశాడు. అయితే డైరెక్టర్ గా వైవిధ్యమైన కథలు తీస్తాడనే ప్రశంసలు వచ్చినా.. సక్సెస్ మాత్రం రాలేదు. 

 

ప్రకాశ్ కోవెలమూడి ఇప్పటి వరకు మూడు సినిమాలు తీశాడు. ఒక కథతో మరొకటి సంబంధం లేకుండా.. అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో, జడ్జ్ మెంటల్ హై క్యా, సినిమాలు తీశాడు. అయితే వీటిల్లో ఒక్కటి కూడా కమర్షియల్ గా క్లిక్ అవ్వలేదు. దీంతో ప్రకాశ్ కోవెలమూడికి ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ దర్శకుడితో సినిమాలకు స్టార్ హీరోస్ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 

 

ప్రకాశ్ ట్రాక్ రికార్డ్ తో అవకాశాలు కూడా రావట్లేదట. టాలీవుడ్, బాలీవుడ్ రెండు చోట్లా సారీ అనే సమాధానమే వినిపిస్తోందట. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెబ్ సిరీస్ లు తీయాలనుకుంటున్నాడట ప్రకాశ్. ఆల్ రెడీ స్టోరీ రెడీ అయ్యిందని రొమాంటిక్ కామెడీ జానర్ లో ఈ సిరీస్ లో ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ప్రకాశ్ కోవెలమూడి తండ్రికి తగ్గ తనయుడిగా తన వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మూడి సినిమాలు చేసి ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. అటు బాలీవుడ్ లోనూ ఆయనకు పరాభవమే ఎదురైంది. ఇక వెబ్ సిరీస్ నే నమ్ముకున్నాడు ప్రకాశ్ కోవెలమూడి. చూడాలి ఆయన కొత్త ప్రయత్నం ఏమాత్రం ఫలితాన్నిస్తుందో.. !


మరింత సమాచారం తెలుసుకోండి: