ప్రస్తుతం నందమూరి బాలయ్య బాబు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ‘రూలర్‌’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ నటించిన చివరి రెండు సినిమాలు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ప్రస్తుతం చేస్తున్న ‘రూలర్‌’ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య బాబు బాగా కష్ట పడుతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సోషల్ మీడియా లో విడుదలైన క్రమంలో బాలయ్య బాబు డైలాగులు కి మరియు కొత్త లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా అయిన వెంటనే మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాల తర్వాత మూడో సినిమా రాబోతున్న తరుణంలో ఈ సినిమా పై బాలయ్య బాబు అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాలో జబర్దస్త్ హాట్ యాంకర్ రేష్మి నటిస్తున్నట్లు సమాచారం. విషయంలోకి వెళితే సినిమాలు యాంకర్ రేష్మి నెగిటివ్ రోల్ పోషిస్తారని చెప్తున్నారు. సినిమాలో ఓ కీలకమైన సమయంలో దాదాపు ఇంటర్వెల్ దగ్గర ఆమె పాత్ర రివీల్ అవుతుందని, ఆ పాత్ర ఎంట్రీతోనే విజిల్స్ పడే రీతిలో బోయపాటి డిజైన్ చేసారని అంటున్నారు. అలాగే సెకండాఫ్ బాలయ్య ...ఈ పాత్రకు వార్నింగ్ ఇచ్చే సీన్స్ హైలెట్ అవుతాయని చెప్తున్నారు.

 

అయితే రేష్మి ఇంకా పాత్రను ఓకే చేసిందా లేదా అనేది తెలియలేదని, నెగిటివ్ పాత్ర అనగానే ఆమె ఆలోచిస్తోందని అంటున్నారు. అంతే కాకుండా ఇదే తరహా పాత్రలో పవర్ ఫుల్ లేడీ పాత్రలో రోజా కూడా నటించబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. మరియు అదే విధంగా జబర్దస్త్ షో లో కమెడియన్లు కూడా ఈ సినిమాలో ఉన్నట్టు సమాచారం. జనవరి నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: