అందరూ అద్భుతమని చెప్పినపుడు ఆ అద్భుతాన్ని ఆస్వాదించడమే మంచిది. కాదు అలాంటి అద్భుతాలు మేమూ సృష్టిస్తామని బయల్దేరితే సమస్యలొస్తాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ చేసిన ఓ పని ఇలానే విమర్శల పాలవుతోంది. ఆయన భార్యను ట్రబుల్స్ లో పడేసింది. 

 

యాద్ పియా కి ఆనే లగీ.. అనే పాట నైంటీస్ లో దుమ్ము దులిపింది. నార్త్ నుంచి మొదలుపెడితే సౌత్, ఈస్ట్ అనే సంబంధం లేకుండా ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ ని టీ సిరీస్ భూషణ్ కుమార్ రీమిక్స్ చేయించాడు. మేజిక్ రీక్రియేట్ అంటూ భార్య దివ్య కుమార్ తో ఈ పాట తీశాడు.

 

ప్యార్ కోయి ఖేల్ నహీ అనే సినిమాలో ఫాల్గుని పాఠక్ పాడిన ఈ పాటను తనిష్క్ భక్షి సారథ్యంలో రీమిక్స్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ రీమిక్స్ కు కంప్లీట్ నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. భూషణ్ కుమార్ ఈ పాటను చెడగొట్టాడని, భార్యకోసం ఇంత మంచి పాటని బలితీసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

 

భూషణ్ కుమార్ భార్య దివ్య కుమార్ వయసు 37ఏళ్లు. అలాంటి ఆమెను రీమిక్స్ లో కాలేజ్ స్టూడెంట్ గా చూపించారు. ఇక వయసుకు సంబంధంలేని ఈ స్టూడెంట్ క్యారెక్టర్ ని, ఎక్స్ ప్రెషన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చేసింది. ఇక ఆమె యాక్టింగ్ కు తగ్గట్లే మ్యూజిక్ ని కూడా ఐసీయూలో పెట్టాడు సంగీత దర్శకుడు. దీంతో భార్యకు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే వజ్రాలు ఇచ్చుకోండి. అంతేగానీ పాత బంగారాన్ని పాడు చేయొద్దంటూ భూషణ్ పై విమర్శలు చేస్తున్నారు జనాలు. మొత్తానికి మంచి పాటను ఇలా ఖూనీ చేస్తాడా అని భూషణ్ కుమార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రయోగాలు మానుకుంటే బాగుంటుదనే కామెంట్లు వస్తున్నాయి. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: