జబర్దస్త్ షోకి ఎంత క్రేజ్ వచ్చిందో.. దాదాపు అలాంటి క్రేజే సంపాధించుకుంది పటాస్ కామెడీ షో. ఈ షోకి యాంకర్ రవి, యాంకర్ శ్రీముఖి కెమిస్ట్రీ అదనపు ఆకర్షణ అని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పటాస్ సూపర్ హిట్ అయింది. దాదాపుగా 1100 ఎపిసోడ్లకు పైగా వీరిద్దరు చేశారు.

 

రేటింగ్ కూడా బాగా వచ్చింది. అలా కంటిన్యూ అవుతూ షో మరింత పాపులారిటీని తెచ్చుకుంది. ఈ షో ద్వారా చాలా మంది కుర్ర కమెడియన్లు కూడా ఇండస్ట్రీకి వచ్చారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ పటాస్ షో రేటింగ్స్ పడిపోయాయి అని తెలుస్తోంది. బిగ్ బాస్ కోసం శ్రీముఖి ఈ షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో నుంచి ఆమె వెళ్లిపోవడం వల్ల బాగానే నష్టం జరిగింది.

 

ఎందుకంటే పటాస్ అంటే కామెడీతో పాటు శ్రీముఖి, రవిల కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉంది. అయితే ఉన్నట్లు ఉండి శ్రీముఖి వెళ్లిపోవడంతో ఆ ప్రభావం షోపై తీవ్రంగా పడింది. దానికి తోడు పటాస్ టీం కూడా మారిపోయింది. ప్రస్తుతం శ్రీముఖి స్థానంలో యాంకర్ వర్షిణి వచ్చింది. అయినా కూడా శ్రీముఖి స్థాయిని ఆమె అందుకోలేకపోతుంది.

 

ఇప్పుడు ఈ షో నుంచి యాంకర్ రవి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. రవి స్థానంలో చలాకీ చంటి వచ్చారు. రవి కూడా లేకపోతే షోకి ఉన్న ఆ క్రేజ్ కూడా తగ్గేలా ఉంది. ఇక రవి వెళ్లిపోవడానికి కారణం ఈ షో తో రవికి ఉన్న అగ్రిమెంట్ అయిపోవడంతో రవి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి భవిషత్తులో ఈ ప్రోగ్రాం ఎలా ఉండబోతుందో చూడాలి. అలాగే ఏదైనా ఒక టీవీ షోకి ముందు ఎవ‌రైతే చేస్తారో వాళ్ళు చేస్తేనే షో బావుంటుంది అలాగే దాని రేటింగులు కూడా బావుంటాయి కానీ మ‌ధ్య‌లో మారితే ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇంక ఆ షో ప‌నైపోయిన‌ట్లే ఇక ఇదిలా ఉంటే జ‌బ‌ర్ద‌స్త్ కూడా ఇంచు మించు అలానే అనిపిస్తుంది. కాకాపోతే వారానికి ఒక హీరో జ‌బ‌ర్ద‌స్త్‌లో వ‌స్తూ ప్రేక్ష‌కుల‌ను కాస్త కొత్త‌గా అల‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: