విక్టరీ వెంకటేశ్ , యువ సామ్రాట్ నాగ చైతన్య ల మల్టీ స్టారర్  వెంకీ మామ విడుదలకు సిద్దమవుతుంది.  నిజ జీవితంలో మామ -అల్లుళ్లు  అయిన వెంకీ, చైతన్య  ఈచిత్రం లో  కూడా అవే పాత్రల్లో కనిపించనుండడంతో   సినిమా  స్టార్ట్ అయ్యే ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఇక నిన్న విడుదలైన  ఈ చిత్రం యొక్క ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుని  ఆ అంచనాలను  మరింతగా  పేచేసింది.  పూర్తి కమర్షియల్ ప్యాకేజీ  తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ బాబీ.  ఇక ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా  32కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  అందులో భాగంగా తెలుగులో రాష్ట్రాల్లో  26కోట్ల బిజినెస్ చేయగా   ఓవర్సీస్ లో 3కోట్లు మిగితా ఏరియాల్లో మరో మూడు కోట్ల వరకు  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.
 
 
ఆ లెక్కనా ఈమొత్తాన్నీ రాబడితేనే సినిమా సేఫ్ అవుతుంది. సోలో  విడుదల కూడా ఈ చిత్రానికి కలిసి రానుంది. వెంకీ గత చిత్రం  ఎఫ్ 2 బ్లాక్ బాస్టర్ అవ్వగా చైతన్య , మజిలీ సూపర్ హిట్ అయ్యింది.  అలా ఈఇద్దరు  ఫామ్ లోకి రావడం  తో వెంకీ మామకు  హిట్ టాక్ వస్తే చాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం. 
 
 
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన  ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించగా   నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నానటించింది.   సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మించిన  ఈచిత్రానికి తమన్ సంగీతం అందించాడు.  డిసెంబర్ 13 న ఈ చిత్రం విడుదలకానుంది.  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: