అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం ఇది. అందువల్ల ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అదీ గాక అల్లు అర్జున్ నుండి చాలా రోజుల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు చాలా అంచనాలు పెంచేసుకున్నారు. ఇప్పటి వరకు రిలిజైన సినిమా పాటలు ఈ సినిమా మీద మరింత అంచనాలని పెంచేశాయి.

 

 

థమన్ అందించిన సంగీతం యూత్ ని షేక్ చేస్తుంది. విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులకి మంచి వినోదం అందించడంతో పాటు సినిమాకి ఎక్కడలేని హైప్ ని తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ విడుదలకి సిద్ధం అవుతోంది. దీని గురించిన సమాచారం మరికొద్ది గంటల్లో తెలియనుంది. అయితే సినిమా మీద అంచనాలు ఎలా పెరుగుతూ వచ్చాయో బడ్జెట్ కూడా అలా పెరుగుతూ వచ్చిందట.

 

 

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటాడు. ఆయన చేతికి హద్దు అదుపూ అనేది ఉండదు. ఈ విషయాన్ని త్రివిక్రమ్ ఒకానొక సందర్భంలో చెప్పిన సంగి తెలిసిందే. అయితే ఈ సినిమాకి కూడా బడ్జెట్ విపరీతంగా అయిందట. నాన్‌ థియేట్రికల్‌, థియేట్రికల్‌ అన్నీ కలుపుకున్నా కానీ నిర్మాతకి చాలా స్వల్ప లాభం వస్తుందని, హీరోకి వచ్చే డబ్బుల మాట అటుంచి, కనీసం దర్శకుడి పారితోషికంతో సమానంగా అయినా లాభం వుండదట. 

 

 

 

సామజవరగమన పాట విడుదల వల్ల ఈ చిత్రానికి క్రేజ్‌ పెరిగినా అదే త్రివిక్రమ్‌లో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పెంచిందని, అందుకే ఈ చిత్రం ఎలాగయినా పెద్ద హిట్‌ అనే ధీమాతో డబ్బులు మంచినీళ్లలా ఖర్చు పెట్టించేసాడని వినిపిస్తోంది. మరి సినిమా రిలీజై వాళ్ళు అనుకున్నంతగా డబ్బులు కలెక్ట్ చేస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: