రష్మీ గౌతమ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. యాంకరింగ్ చేస్తునే సినిమాల్లో కూడా నటిస్తోంది. తన అందంతో ఎంతో మందిని తనవైపుకు తిప్పుకుంది. తరుచూ ఫోటో షూట్లు చేస్తూ కుర్రకారు మదిని దోచేస్తోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో రష్మీ ఓ బంపర్ ఆఫర్ పట్టేసిందని తెలిసింది.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త్’, ‘ఢీ’ షోలకు యాంకరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది రష్మీ గౌతమ్. ఈ రెండింటిలో సుడిగాలి సుధీర్ కూడా ఉండడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొంత మంది అయితే రష్మీ – సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అన్నారు. దీంతో ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వీరిద్దరు చెబుతున్నప్పటికి  ఈ రూమర్స్ ఆగడం లేదు.

 

తాజా రష్మీకి సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అది కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర‌లో ఈ అమ్మ‌డు న‌టించ‌బోతుంద‌ని స‌మాచారం. ఈ పాత్ర సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇక మ‌రి ఒకేసారి ర‌ష్మీ క్రేజ్ ఒక రేంజ్‌లో మారిపోనుందా. ఆల్రెడీ క్రేజీ యాంక‌ర్ ఇక పెద్ద హీరోల ప‌క్క‌నంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్.. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. సమకాలీన సామాజిక అంశాలపై స్పందించడంతో పాటు తనకు సంబంధించి రెగ్యులర్ అప్‌డేట్స్ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

 

 ఈ ప్రోగ్రామ్‌కు ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. ర‌ష్మి మంచి బ్రేక్ కోసం వేచి చూస్తుంది. సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌ష్మి గౌత‌మ్ త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ ఉంది. బుల్లితెర‌, వెండితెర‌కే పరిమిత‌మైన ర‌ష్మి గౌత‌మ్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియంలోకి ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్‌గా వైజాగ్‌లో త‌న సోద‌రుడి పెళ్లి వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌గా, ఈ వేడుక‌లో ర‌ష్మి సంద‌డి మాములుగా లేదు. సాంప్రదాయంగా లంగా ఓణీ ధరించి స్టైలిష్ గా ఉన్న ర‌ష్మి బారాత్‌లో తీన్‌మార్ స్టెప్పులు వేసి అంద‌రు నోరెళ్ళ‌పెట్టేలా చేసింది. త‌న కుటుంబ స‌భ్యుల‌తో సైతం డ్యాన్స్ చేయించింది. ర‌ష్మి స్టెప్పుల‌ని చూసిన చుట్టు ప‌క్క‌ల వారు ఫిదా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: