తెలుగు సినిమాలు చాలా భాషల్లో రీమేక్ లకి వెళ్తున్నాయి. ఈ మధ్య తెలుగు సినిమాలు కంటెంట్ బేస్డ్ గానే వస్తున్నాయి. మునుపటిలా నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు ఉండి కథని ఎలాగోలా నడిపిస్తానంటే కుదరట్లేదు. సినిమాలో కొత్తదనం ఉంటే తప్ప జనాలు థియేటర్లకి రావట్లేదు. అందువల్ల తెలుగు సినిమాల్లో చాలా మార్పొచ్చింది. ఆ మార్పు ప్రస్తుతం వస్తున్న కథల్లో స్పష్టంగా అర్థం అవుతుంది.

 

అయితే మారుతున్న తెలుగు సినిమాలు పక్క రాష్ట్రాల వారిని అమితంగా ఆకర్షిస్తున్నాయి. అందుకే తెలుగు నుండి రీమేక్ కి వెళ్ళే సినిమాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అటు బాలీవుడ్ లో కోలీవుడ్ లో తెలుగు సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఈ సంవత్సరం తెలుగులో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ "బ్రోచేవారెవరురా" చిత్రం తమిళంలో రీమేక్ కానుందట. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది.

 


యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ లో శ్రీవిష్ణు తో పాటు రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్ కీలక పాత్రలు చేయడం జరిగింది., నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సినిమా ఆద్యంతం ప్రేక్షకులు విపరీతంగా నవ్వించింది. ముఖ్యంగా శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి ల నటన సినిమాకే హై లెట్ గా నిలిచింది. విజయ్ కుమార్ మన్యం నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం అటు ప్రేక్షకులు ఇటు క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకుంది.

 

కాగా ఈచిత్ర తమిళ రీమేక్ హక్కులు ఓ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ దక్కించుకుందట. యూనివర్సల్ స్టోరీ కావడంతో బ్రోచేవారెవరురా మూవీని తమిళంలో రీమేక్ చేసే ఆలోచనలు మొదలుపెట్టారట. దీనితో ప్రీ ప్రొడక్షన్ పనులుకూడా మొదలుపెట్టారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: