సినిమా వచ్చిందా.. చేశామా.. రిలీజ్ అయిందా..?  అన్నట్టు ఉంటుంది వెంకటేశ్ వ్యవహారం. వెంకీమామ సిినిమా దగ్గరకొచ్చేసరికి వెంకటేశ్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అన్నీ తానై.. ఎనర్జిటిక్ గా మాట్లాడుతున్నాడు. ఈ ఒక్కసినిమా కోసమే ఎందుకంత సందడి చేస్తున్నాడు. 

 

13న రిలీజ్ అవుతున్న వెంకీమామ ప్రమోషన్ ని చిత్రయూనిట్ ఒక్కసారిగా పెంచేసింది. రిలీజ్ డేట్  ఎనౌన్స్ మెంట్ కోసం పెట్టిన ప్రెస్ మీట్ తో ప్రచారం స్టార్ట్ చేసింది. గత శనివారం ఖమ్మంలో ప్రీ రిలీజ్ వేడుక జరుగగా హైదరాబాద్ నుంచి బయల్దేరడానికి ముందు ప్రెస్ మీట్ లో వెంకటేశ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదన్న గుసగుసలు వినిపించాయి. మేనల్లుడితో కలిసి నటించిన సినిమా కావడమే ఈ ఎనర్జీకి కారణమంటున్నాయి చిత్ర వర్గాలు. 


వెంకీమామ ప్రమోషన్ లో అందరూ ఎనర్జిటిక్ గా కనిపించారు. సినిమాలోని వెంకటేశ్ డైలాగ్ ను.. రాశిఖన్నా.. పాయల్ కలిసి డబ్ స్మాష్ చేశారు. ఖమ్మం వేడుక కోసం బస్సులో వెళ్తున్న టైమ్ లో డబ్ స్మాష్ తో ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది రాశి. 

 

తక్కువ టైమ్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో.. చిత్రయూనిట్ మొత్తం ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఒకవైపు ఇంటర్వ్యూలు.. మరోవైపు ప్రెస్ మీట్స్. ఇలా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తోంది వెంకీమామ అండ్ టీమ్. మరోవైపు వెంకీమామ మూవీ కోసం ఇటు వెంకటేశ్ అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజంగా నాగచైతన్యకు స్వయంగా మేనమామ వెంకటేశ్ కావడంతో.. వారిద్దరి మధ్య ఎమోషన్స్ ఏ స్థాయిలో చూపించారోనని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి.. వెంకీమామలో.. వెంకటేశ్.. నాగచైతన్య బంధం ఎలా ఉండనుందో.. !



 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: