ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ లు పని చేస్తున్నాయి. వాళ్ళకి ఆరోగ్యపరమైన ఎలాంటి సమస్యలొచ్చిన ఈ చారిటబుల్ ట్రస్ట్ ల ద్వారా సహాయం పొందుతున్నారు. సమాజంలో ఉన్న వాళ్ళకి తమ వంతు సహాయం అందించడం.. ఇది నిజంగా బాద అని చెప్పాలి. ఇక మన స్టార్ల చారిటీ యాక్టివిటీస్ గురించి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సహా స్టార్ హీరోలంతా తమ స్థాయికి తగ్గట్టు చారిటీ సాయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ స్ఫూర్తితో మెగా ఫ్యాన్స్ ఇప్పటికే చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ - నమ్రత బృందం చారిటీ యాక్టివిటీస్ గురించి తెలిసిందే. ఈ తరహా చారిటీ సేవల్లో సమంత పేరు ప్రముఖంగానే వినిపిస్తుంది. తను కూడా ఎంతో మంది చిన్నారులను చేరదీసి కావలసినవన్నీ సమకూర్చుతోంది. 

 

లేటెస్ట్ గా చారిటీ యాక్టివిటీస్ లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అడుగు పెట్టడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన నిస్సహాయులకు ఈ చారిటీ అవసరార్థం సాయం చేయనుందట. అందుకోసం ఎన్టీఆర్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కానుంది. ఈ ట్రస్ట్ ద్వారా పేద.. బడుగు.. బలహీన వర్గాల వారికి సాయం అందిస్తారు. సౌత్ లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఎన్టీఆర్. ఆయన ఫ్యాన్స్ చారిటీ కార్యక్రమాలు చేయడం ఎందరికో ఆపదలో సాయమవుతుందనడంలో సందేహం లేదు. ఇది గొప్ప ప్రయత్నం. పేదలకు గొప్ప అవకాశం. 

 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కానుంది. తారక్ కి ఇది తొలి పాన్ ఇండియా సినిమా అనే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. త్రివిక్రమ్.. కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు తారక్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: