రాఘవేంద్ర లారెన్స్ గురించి ఎవరికైనా తెలుసో లేదో కానీ.. లారెన్స్ అంటే మాత్రం ఠక్కున చెప్పేస్తారు. తెలుగులో చిరంజీవి నుంచి చిన్న హీరో వరకూ అందరి చేతా డ్యాన్స్ వేయించాడు. రజనీకాంత్ కు వీరాభిమాని అయిన లారెన్స్ సూపర్ స్టార్ పై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటాడు. అదే ఊపులో అభిమానాన్ని చూపిస్తూ లోకనాయకుడు కమల్ హాసన్ పై రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కల్లోలం సృష్టిస్తున్నాయి.

 

 

రీసెంట్ గా రజనీకాంత్ దర్బార్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు హాజరైన లారెన్స్ కమల్ పై యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. నేను చిన్నప్పటి నుంచి రజనీ అభిమానిని. చిన్నతనంలో కమల్ హాసన్ పోస్టర్ కనపడితే పేడ కొట్టే వాడిని. కానీ ఇప్పుడు వారిద్దరూ చేయీ చేయి కలిపి నడుస్తుంటే ముచ్చటగా ఉంది. చూడబోతే భవిష్యత్తులో అద్భుతాలు జరిగేలా ఉన్నాయి అన్నాడు. ఈ మాటలకు అక్కడున్న రజనీ అభిమానులు చప్పట్లు కొట్టినా.. ఊరకనే కమల్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయనపై చేసిన ఈ వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 

 

నీకు రజనీ అంటే అభిమానం ఉంటే చెప్పుకోవాలి గానీ కమల్ గురించి ఇలా మాట్లాడటం తగదు’, ‘ఇప్పటి వరకూ నీవు చేసే చారిటీతో నీమీద ఉన్న గౌరవం అంతా ఈ క్షణాన పోగొట్టుకున్నావ్.. అంటూ రకరకాలుగా లారెన్స్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి లారెన్స్ స్పందిస్తూ.. అది నా చిన్ననాటి సంఘటనగా చెప్పాను. అప్పట్లో నాకు కమల్ ఎవరో పెద్దగా తెలీదుఅంటూ ముక్తాయింపు ఇచ్చిన ట్రోలింగ్ మాత్రం ఆగటం లేదు. లారెన్స్ తమిళుడైనా అక్కడ డ్యాన్స్ మాస్టర్ గా కంటే ఆతను చేసే చారిటీ ద్వారానే బాగా సుపరిచితుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: