ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9న మొదలు కానున్నాయి. దీంతో అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ మరియు విపక్ష పార్టీకి చెందిన నాయకులు తమ వాదనలకు సంబంధించి ప్రశ్నలు మరియు సమస్యలు రెడీ చేసుకుంటున్నారు. తాజాగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలకమైన బిల్లులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టే అవకాశం ఉన్నట్లు మరియు అదే విధంగా మద్యం విక్రయాలలో అక్రమాలు నిల్వను అరికట్టడం కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావడానికి అసెంబ్లీ వేదికగా జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రతిపక్ష పార్టీ టిడిపి మొట్టమొదటి రోజే అసెంబ్లీ సాక్షిగా భారీ ప్లాన్ తో జగన్  సర్కార్ ని దెబ్బ కొట్టడం కోసం సరైన అస్త్రాలు రెడీ చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి.

 

వస్తున్న సమాచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీ టిడిపి ఏపీ ఆర్థిక పరిస్థితి, జగన్ సర్కారు చేస్తోన్న అప్పులు, ఆర్టీసీ ఛార్జీల పెంపు తదితర 21 అంశాలపై ప్రతిపక్షం ప్రశ్నలు గుప్పించే అవకాశం ఉంది. ఇదే క్రమంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రతిపక్ష పార్టీ అడిగే ప్రతి ప్రశ్నకు తమ దగ్గర సమాధానం ఇచ్చే విధంగా అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన జరగనున్న అసెంబ్లీ లో ఎక్కడ కూర్చుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

 

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో 22 మంది ఎమ్మెల్యేలు ఉండటం జరిగింది ఇంకా నలుగురైదుగురు పార్టీ మారితే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది దీంతో ఇప్పటికే కొంతమంది పార్టీ మారడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో చూడాలి. మరోపక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మారకుండా పార్టీ వీడకుండా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: