బాహుబలి సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ స్థాయి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది...సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నాడు.. అందుకే ఫాన్ ఇండియా హీరోగా కూడా కొత్త అవతారం ఎత్తారు.. అది ప్రభాస్ మార్కెట్..ఇక ఈయన సాహొ సినిమా గట్టి దెబ్బ వేయడంతో కాస్త టైమ్ తీసుకొని మరి ఓ సినిమాలో నటిస్తున్నారు..గతం యాక్షన్ కోణంలో వచ్చిన సినిమాల్నీ భారీ డిజాస్టర్ గా మారిన కూడా ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా కూడా ఫ్లాప్ ను చవిచూసింది..


ఈ మేరకు ఆయన కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు.. ఈ నేపథ్యంలో ఓ సినిమాకు సైన్ కూడా చేశాడు..ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ ను అనుకుంటు న్నారు. 


సినిమా తదుపరి షెడ్యూల్ నవంబర్ 18 నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. దీనికోసం ఇటలీలో ఒకప్పటి పరిస్థితులు, వాతావరణాన్ని తలపించేలా హైదరాబాద్‌లో భారీ సెట్ కూడా వేస్తున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథ కడుతుంది.. మహర్షి సినిమాతో హిట్ కొట్టిన పూజ ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.


అసలు విషయానికొస్తే..ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది..కారణాలేమిటో తెలియదు కాని ఈ షెడ్యూల్ అనుకున్న సమయానికి ప్రారంభం  కాలేదు. అయితే, ఈ షెడ్యూల్‌ను జనవరి మూడో వారానికి వాయిదా వేశారని ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. ప్రభాస్ ఇప్పటి కే లాంగ్ హాలీడేను ఎంజాయ్ చేయడాని కి విదేశాల కు వెళ్లిపోయారట. ఎక్కడికి వెళ్లారన్నది మాత్రం సీక్రెట్. ఆయన తిరిగి మళ్లీ జనవరిలో హైదరాబాద్‌కు వస్తారట. జనవరి 3వ వారంలో మాత్రమే షూటింగ్ ప్రారంభమవుతుందని ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.. మరి చూడాలి ఎప్పుడు ప్రారంభమవుతోందో...

మరింత సమాచారం తెలుసుకోండి: