తమిళ తలైవా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ డ్యాన్సర్ డైరెక్టర్ హీరో రాఘవ లారెన్స్ అన్నారు. ఆయన సినిమాలు చూస్తూ సినిమాపై మక్కువ పెంచుకున్న నని కూడా లారెన్స్ తెలిపారు.సూపర్ స్టార్‌పై ఉన్న అభిమానంతో చిన్నప్పుడు వేరే హీరో సినిమా పోస్టర్‌పై పేడ కొట్టినట్లు పేర్కొన్నారు. దీంతో సదరు హీరో అభిమానులు లారెన్స్‌పై సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెట్టడం ప్రారంభించారు.


విషయానికొస్తే.. లారెన్స్‌ ఈ విషయంపై స్పందించి ఆ హీరో అంటే తనకు గౌరవం ఉందని తెలిపుతూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసలేం జరిగిందంటే..సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా హాజరైన లారెన్స్‌ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి నేను రజనీకాంత్‌కు వీరాభిమానిని. దీంతో చిన్నప్పుడు కమల్‌ హాసన్‌ సినిమా పోస్టర్లపై పేడ కొట్టేవాడిని. పెద్దవాడినయ్యాక వారిద్దరి మధ్య ఉన్న ఆదరాభిమానాలను చూశాక నాకు అర్థమైంది.. వారిద్దరు మంచి స్నేహితులని. దీంతో అప్పటి నుండి కమలహాసన్ కు వీరాభిమాని అయ్యారని అన్నారు..

ఈ నేపథ్యంలో ట్రోల్స్‌పై స్పందించిన లారెన్స్‌ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘‘దర్బార్‌’ ఆడియో విడుదల కార్యక్రమం తర్వాత సోషల్‌మీడియాలో నా గురించి కొన్ని పోస్ట్‌లను చూశాను. కమల్‌ సినిమా పోస్టర్లపై పేడ కొట్టానని చెప్పినట్లు అందులో ఉంది. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఆడియో వేడుకలో నేను మాట్లాడిన వీడియోను పూర్తిగా చూడండి. చిన్నప్పుడు తలైవార్‌ వీరాభిమానిగా ఉన్న నేను అలాంటి పనులు చేశానని చెప్పాను. అలాగే.. కమల్‌ - రజనీ మధ్య ఉన్న స్నేహం చూశాక నేను చాలా సంతోషించానని కూడా చెప్పాను. 


ఏ సందర్భంలోనైనా నేను తప్పుగా మాట్లాడితే ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్పేవాడిని. కానీ నేను ఈ ఆడియో కార్యక్రమంలో ఎలాంటి తప్పు మాట్లాడలేదు కావాలంటే మీరు సంబంధిత వీడియోను సరిగ్గా చూడండి. కొందరు వ్యక్తులు కావాలని దీనిని హైలైట్‌ చేస్తున్నారు. కమల్‌ అంటే నా మనసులో ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు. అందరికీ దీని గురించి వివరణ ఇవ్వాల్సిన పని లేదు .. ఎటువంటి అనుమానాలు ఉంటే ఈ వీడియో ను చూడండి అంటూ లారెన్స్ వ్యాఖ్యానించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: