బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ హౌజ్ లో అందరి కన్నా పునర్నవితో ఎక్కువ క్లోజ్ గా ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక విధంగా హౌజ్ లో సర్వైవ్ కాగలిగాడు అంటే అది పునర్నవి, వరుణ్, వితిక వల్లే అని చెప్పొచ్చు. అయితే హౌజ్ నుండి బయటకు వచ్చాక కూడా రాహుల్ వెంటే పునర్నవి కలిసి కబడ్డది.

 

బిగ్ బాస్ సీజన్ 3 పూర్తయ్యాక కూడా రాహుల్, పునర్నవి కలిసి ఇంటర్వూస్ ఇచ్చారు. వీళ్ళిద్దరి మద్య ఏదో జరుగుతుంది అనే వార్తలు తరచూ వస్తూనే ఉంటాయి. అయితే రాహుల్ కు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తరపున ఒత్తిడి పెరగడంతో పునర్నవికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు.

 

బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక హౌజ్ లో శత్రువుగా కనిపించిన రాహుల్, శ్రీముఖి ఫైనల్ గా మిత్రులుగా మారారు. గతం గతః అంటూ హౌజ్ లో జరిగిన విషయాలన్నీ మర్చిపోయినట్టే చెప్పాడు. అయితే శ్రీముఖి వచ్చింది కదా అని పునర్నవికి హ్యాండ్ ఇచ్చాడు రాహుల్.

 

ఏదైనా మొహమాటం లేకండా మనసులో ఏముందో చెబుతారు. అలానే శ్రీముఖి వచ్చిందో లేదో కాని లేటెస్ట్ గా పునర్నవి ఇక సల్లబడు అంటూ కామెంట్ పెట్టాడు. పైకి వాళ్ళిద్దరూ కాదు లేదని చెబుతున్నా ఇద్దరు మధ్య ఏదో జరుగుతుందని అంటున్నారు. మరి ఇక మీదట అయినా పునర్నవి లేకుండా రాహుల్ ఒక్కడే కనిపిస్తాడని అంటున్నారు. అంతేకాదు తన కొత్త జోడీ శ్రీముఖి హెల్ప్ కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే పునర్నవి మీద కామెంట్ చేశాడు. రాహుల్ క్యాజువల్ గా మెసేజ్ పెట్టినా పునర్నవి మాత్రం ఈ విషయంలో అప్సెట్ అయినట్టు తెలుస్తుంది. రాహుల్ తో ఇక దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: