నన్ను అంతా కూల్ అనుకుంటున్నారు.. కానీ.. నేను చాలా హాట్ అంటూ ఈ మధ్య ప్రకటించి సంచలనం సృష్టించింది హీరోయిన్ ఈషా రెబ్బా.. చూడగానే అబ్బా అనిపించే ఈ అందాల బ్యూటీ అచ్చ తెలుగు అమ్మాయి. అయితే కేవలం స్టేట్ మెంట్ ఇవ్వడమే కాదు.. అంటూ అందుకు తగ్గట్టు అందాల ప్రదర్శన కూడా చేస్తోంది. ఈ మధ్య తొడ అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ ఊరిస్తోంది.

 

పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్టు తెలుగు డైరెక్టర్లు, యాక్టర్లు ఎంత సేపూ ముంబై భామల వెనకాలో.. కేరళ కుట్టీల వెనకాలో పడతారు తప్ప తెలుగందాలు ఊరిస్తున్నా పెద్దగా పట్టించుకోరు. ఇందుకు ఈషా రెబ్బానే ఓ ఉదారహణ. అచ్చ తెలుగు అమ్మాయిలా చూడగానే ఆకట్టుకునే ఈ ఈషా రెబ్బాకు మాత్రం ఇప్పటి వరకూ మంచి బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఇటీవల వచ్చిన రాగల 24 గంటల్లో సినిమా కాస్త పర్వాలేదనే చెప్పాలి.

 

బందిపోటు, అమీ తుమీ వంటి మూవీతో పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ జూనియర్ ఎన్టీయార్ త్రివిక్రం మూవీ అరవింద సమేతలో హీరో చెల్లెలు పాత్రలో కనిపించింది. అ అనే సినిమాలో నిత్యామీనన్ తో లెస్బియన్ గానూ నటించి డేరింగ్ అనిపించుకుంది. సుమంత్ తో జత కట్టి చేసిన సుబ్రమణ్యపురం మూవీ కూడా మంచి పేరు తెచ్చింది. అయితే ఇప్పటి వరకూ సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి.

 

సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్న ఈషా రెబ్బ తన అందాల బంధాలతో అటు నెటిజన్లను, ఇటు ఫిల్మ్ మేకర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో పడింది. తెలుగమ్మాయి తరహాలో ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదనుకుందో ఏమో ఈసారి కాస్త డోస్ పెంచేసింది. ముఖారవిందంతో పాటు తొడల అందాలు కూడా చూపిస్తూ కవ్విస్తోంది. మరి ఈ అందాలు మన నిర్మాత కళ్లలో ఎప్పుడు పడతాయో.. ఈషాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: