అనుపమ పరమేశ్వరన్.. బొద్దు అందాల ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాస్త చిక్కినట్టు కనిపిస్తోంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు.. తన స్లిమ్ ఫోటోలతో అదరగొడుతోంది. హాట్ హాట్ ఫోటోలు ఎప్పుడూ ఉండేవే కదా అనుకుందో ఏమో.. ఈసారి అచ్చ తెలుగు ఆడపడుచులా కుర్రాళ్ల మనుసు దోచేందుకు ప్రయత్నించింది.

 

చక్కటి చీరకట్టుతో పాటు.. జడలె మల్లెలు తురుముకుంటూ కనిపించి ఈ ఫోటోకు మంచి కామెంట్లు వస్తున్నాయి. ఆ హా అచ్చ తెలుగు పడుచు అందం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తులతో అందమైన ముస్తాబుతో అదరొకొడుతోంది. చక్కగా అలంకరించుకున్న అందాల యువరాణి అనుమప కొత్త ఫోటోలు తనే సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

 

ఈ చిత్రాలు కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉన్నాయి. సంప్రదాయంలో ఎంత అందం ఉందో ఈ పిక్స్ చెబుతున్నాయి. ఎప్పుడూ హాట్ హాట్ అందాలతోనో.. లేకపోతే..లేటెస్ట్ మూవీ స్టిల్స్ పోస్టు చేసే అనుపమ.. తాజాగా పోస్టు చేసిన ఫోటోలు రమణీయంగా ఉన్నాయి.. అనుపమ సోయగాలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. అయితే అదిరే అందాలు.. చక్కటి అభినయం ఉన్నా అనుపమకు మాత్రం పెద్దగా ఛాన్సులు రావడం లేదు.

 

ఈ మ‌ధ్యే తెలుగులో రాక్షసుడు సినిమా చేసింది అనుపమ. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఇండస్ట్రీలో అందాలు ఆరబోయడం ఇష్టం ఉండని అతికొద్ది మంది హీరోయిన్లలో అనుపమ ఒకరు. ..ఆ సినిమాతో తెలుగు వాళ్లకు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుంది.అయితే మొదట్లో ఈ అమ్మడుకు గోల్డెన్ లెగ్ అన్న టాక్ వచ్చింది. ఆ త‌ర్వాత మాత్రం అదే జోరు కొన‌సాగలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: