ప్రస్తుతం అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తున్న  షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు లీక్ కాకపోయినా ఈ మూవీ షూటింగ్ లో అలియా భట్ తన వంటల పిచ్చితో రాజమౌళికి సృష్టించిన సమస్యలకు సంబంధించిన వార్తలు మాత్రం లీక్ అయ్యాయి. ఇటీవల ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ తో జాయిన్ అయిన అలియా భట్ పై రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను అలియభట్ చరణ్ లపై చిత్రీకరిస్తున్నప్పుడు అలీయా వంటల పిచ్చి బయటపడినట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు అలియా భట్ తన చిన్న తనం నుండి వంటల పిచ్చి ఉందట.  మహేష్ భట్ వారసురాలిగా బాలీవుడ్ యువరాణిగా వెలిగిపోతున్న ఈమె కోరుకుంటే కొండమీద నుంచి కోతిని నిర్మాతలు దించి పెట్టె అవకాశం ఉంది. అయినా అలియాకి ఆరోగ్యం విషయంలో ఉన్న శ్రద్ధతో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అలియా భట్ తనకు కావాలసిన తినుబండారాలు తానే స్వయంగా తయారు చేసుకుంటుందట. వంటవాళ్ళ సాయంతో దగ్గరుండి రెడీ చేయించుకుంటోంది. 

దీనికోసం ఒక స్పెషల్ కిచెన్ ను తాను ఉండే విలాసవంతమైన హోటల్ లోనే అలియా ఏర్పాటు చేసుకుంటుందట. ఉదయం టిఫిన్ మొదలు రాత్రి భోజనం వరకూ అంతా ఇంటి వంట ఔట్ డోర్ షూటింగ్ ల విషయంలో కూడ ఈ నియమాలు అలియా తప్పదు అని సమాచారం. ఏ సమయంలో ఎంత తినాలి ? అనే దానిపై  ఈమెకు  కొన్ని లెక్కలు ఉంటాయట. 

ఈ టైమ్ టేబుల్ ని తూచ తప్పకుండా అనుసరించడం వలనే తాను ఇంత ఫిట్ గా ఉండటానికి గల కారణం అని ఆమె భావన. అంతేకాదు ఫుడ్ కి సంబంధించి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తూ అలియా లక్షలలో సంపాదిస్తోంది. ఈపరిస్థితులలో ఈమధ్య హైదరాబాద్ వచ్చిన ఈమె ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ సమయంలో కూడ తన వంటల పిచ్చిని రాజమౌళి ఎదుట ప్రదర్శించడంతో రాజమౌళి తల పట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: