తెలుగుదేశం ఘోర పరాజయం తరువాత జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి తీసుకురావాలి అంటూ తెలుగుదేశంలోని ఒక వర్గం ఓపెన్ గానే మాట్లాడుతోంది. అయితే ఈ విషయాల పై తెలుగుదేశం అధి నాయకత్వం కాని జూనియర్ కాని స్పందించకుండా వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈట్రస్ట్ ప్రారంభోత్సవం త్వరలో జూనియర్ చేతుల మీదుగా జరగబోతున్నట్లు  సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో జూనియర్ అభిమాన సంఘాలు ఉన్న చాల పట్టణాలలో ఇకనుంచి ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు చేసే విధంగా జూనియర్ సలహాతోనే ఈ ట్రస్ట్ ఏర్పడుతున్నట్లు టాక్. 

పేరుకు ఈ ట్రస్ట్ ను నిర్వహించేది జూనియర్ అభిమానులు అయినప్పటికీ అన్ని విషయాలలోనూ జూనియర్ పరోక్ష సహకారంతో ఈ ట్రస్ట్ కార్యకలాపాలు కొనసాగుతాయి అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో కొన్ని వందల సంఖ్యలో జూనియర్ అభిమాన సంఘాలు ఉన్నాయి. దీనికితోడు సోషల్ మీడియాలో జూనియర్ పై అభిమానాన్ని ప్రదర్శించే కొన్నివేల మంది అభిమానులు ఉన్నారు. వీరందరిని ఒక పద్ధతిలో ఒక వ్యవస్థీకృతమైన సంస్థలో భాగస్వాములుగా చేయడానికి జూనియర్ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. 

దీనితో రానున్న రోజులలో తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా జూనియర్ ఒక క్రియాత్మక ఫోర్స్ ను ఈ ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీసస్ ట్రస్ట్ ద్వారా తనకు తానుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ వ్యూహాలు వెనుక జూనియర్ రాజకీయ ఎత్తుగడలు ఎంత వరకు ఉన్నాయో తెలియకపోయినా ఎన్టీఆర్ పేరు మటుకు మరొకసారి తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో ఈ సేవా కార్యక్రమాలద్వారా జనంలోకి వెళ్ళి ఎన్టీఆర్ ను జనం మరిచిపోకుండా చేయడంలో జూనియర్ విజయం సాధిస్తాడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: