సందీప్ కిషన్ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాదిలో సందీప్ నుండి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో నిను వీడని నీడని నేనే లాంటి హారర సినిమా కూడా ఉంది. ఈ సినిమాని తానే నిర్మించాడు. ఈ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వనప్పటికీ ఫర్వాలేదనిపించింది. అయితే మొన్నటికి మొన్న తెనాలి రామక్రిష్ణ అనే చిత్రాన్ని చేశాడు.

 

 

కామెడీ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అతని సినిమా కెరీర్ విజయవంతంగా సాగకపోయినప్పటికీ సినిమాలు మాత్రం వరుసగా చేస్తున్నాడు. అయితే అటు సినిమా కెరీర్ చూసుకుంటూనే వ్యాపారం వైపు అడుగులు వేశాడు సందీప్. సినిమాల్లో కెరీర్ నిలకడగా ఉండదు కాబట్టి వ్యాపారపరంగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. చాలా మంది హీరోలు ఇలా సైడ్ బిజినెస్ చేస్తుంటారు.

 

 

సందీప్ కూడా బిజినెస్ చేస్తున్నాడు. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ బాగా రన్ అవుతున్న టైమ్ లోనే మరో బిజినెస్ లోకి దిగాడు సందీప్. తాజాగా ఆయన బ్యూటీ సెలూన్ స్థాపించనున్నారు. విజయవాడ వేదికగా క్యూ బి ఎస్ అనే ఓ బ్యూటీ సెలూన్ రేపు ప్రారంభించనున్నారు. ఈ క్యూ బి ఎస్ యూనిసెక్స్ సెలూన్ నందు ఆడ మరియు మగవారికి సంబందించిన హెయిర్, బ్యూటీ కి సంబందించిన సేవలు దొరుకుతాయి. 

 

 


ఈరోజు ఉదయం 12 గంటలకి గ్రాండ్ గా ప్రారంభం కానుండగా ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ రావలసిందిగా సందీప్ ఆహ్వానించారు. హీరోగా అప్పుడప్పుడు సక్సెస్ లు అందుకుంటున్న సందీప్ బిజినెస్ లో దూసుకుపోవాలని  రెస్టారెంట్ బిజినెస్ లాగే ఈ బిజినెస్ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: