సల్మాన్ ఖాన్ కు రాబోతున్న క్రిస్మస్ పెద్ద పరీక్ష పెట్టబోతోంది. సాధారణంగా సల్మాన్ ఖాన్ సినిమాలు రంజాన్ కు వస్తాయి. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఇప్పుడు సల్మాన్ క్రిస్మస్ సీజన్ కు తన ‘దబాంగ్ 3’ ని తీసుకు వస్తున్నాడు. సల్మాన్ ఖాన్ కు కొనసాగుతున్న క్రేజ్ రీత్యా అతడి మూవీలకు ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో తేడా లేకపోయినా గత కొంత కాలంగా అతడి సినిమాలు అన్నీ వరస పరాజయాలు చెందుతున్నాయి. 

దీనితో సల్మాన్ మార్కెట్ దెబ్బ తింది. అయితే తాను కోల్పోయిన మార్కెట్ ను దక్షిణాది రాష్ట్రాల నుంచి రప్పించుకోవడానికి ‘దబాంగ్ 3’ ని తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలలో డబ్ చేస్తున్నారు. ఈనెల 20న విడుదల కాబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధులుగా చరణ్ రానా లను స్వయంగా సల్మాన్ ఫోన్ చేసి పిలిచినట్లు టాక్.

సల్మాన్ లాంటి టాప్ హీరో నుంచి పిలుపు రావడంతో చరణ్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ పనులు ఉన్నా రాజమౌళి పర్మిషన్ తీసుకుని ఈ ఈవెంట్ కు అతిధిగా వస్తున్నట్లు తెలుస్తోంది. నేషనల్ సెలెబ్రెటీ సల్మాన్ ఖాన్ తో చరణ్ రానాలు కలిసి వేదిక పంచుకుంటే అది మీడియాకు హాట్ న్యూస్ గా మారి తద్వారా ‘దబాంగ్ 3’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది. 

గతంలో వచ్చిన ‘దబాంగ్ 2' కు సీక్వెల్‌ గా వస్తున్న ఈసినిమాలో సల్మాన్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలోని వీణ స్టెప్ వేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు వెర్షన్ ను సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్న నేపధ్యంలో సురేశ్ బాబు ఇలా వ్యూహాత్మకంగా చరణ్ రానా లను ‘దబాంగ్ 3’ ప్రమోషన్ లో ఉపయోగిస్తున్నాడు అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: