టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న మూవీ ‘వెంకిమామ’.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ లాంటి మంచి హిట్ సినిమా తర్వాత కే.ఎస్ రవి చంద్ర (బాబీ) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.  రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వెంకటేశ్,నాగ చైతన్య ఇద్దరు మామా అళ్లుల్లు కావడం విశేషం. ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,కోన ఫిల్మ్ కార్పోరేషన్,సురేష్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  వెంకటేష్, నాగచైతన్య కలిసి ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా మామా అళ్లుల్లు కలర్ ఫుల్ గా మెరిసిపోతున్న స్టిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరూ పంచెకట్టులో ఇరగదీశారు.  ఈ మూవీ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.  

 

విలేజ్ నేపథ్యంలో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ లో మామపై అల్లుడి ప్రేమ.. అల్లుడిపై మామ ప్రేమని ఎంతో బాగా చూపించారు. ఆ తరువాత బార్డర్ సన్నివేశాలు చూపించారు. బార్డర్ కి వెళ్లిన అల్లుడు మూడు సంవత్సరాలు అయినా ఎందుకు తిరిగి రాలేదు? మిస్ అయిన అల్లుడు కోసం మామ బార్డర్ కు ఎందుకు వెళ్ళాడు? అనే విజువల్స్ తో మామా అల్లుళ్ల మధ్య అనుబంధం సూపర్ గా ఉంది. మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం అంటూ చెప్పే వెంకటేశ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. థమన్ సంగీతంతో ఈ సినిమా సన్నివేశాలను ఎలివేట్  చేశారు.  మొత్తాని ట్రైలర్ టాక్ బాగుందని అంటున్నారు.

 

ఈ మద్య దేశ వ్యాప్తంగా టిక్ టాక్ ల జోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా టిక్ టాక్ లతో దుమ్మురేపుతున్నారు జనాలు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు టిక్ టాక్ లతో అదరగొడుతున్నారు.  తాజాగా వెంకిమామ లో నటించిన హీరోయిన్స్ పాయల్ రాజ్ పూత్, రాశీఖన్నా ఈ మూవీలో డైలాగ్స్ తో టిక్ టాక్ చేశారు. గోదావరిలో ఈత నేర్పా..బరిలో ఆట నేర్పా..ఇపుడు జాతరలో వేట నేర్పిస్తా..రారా అల్లుడు అంటూ వెంకీ మామ ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ అందరినీ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇపుడు ఇవే డైలాగ్స్ ను సినిమా హీరోయిన్లు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా డబ్ స్మాష్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశారు.  ఇదే సమయంలో వారిముందు నాగ చేతన్య రావడం..ఫన్నీగా ఉంది. ఈ టిక్ టాక్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: