పోర్న్..ఈ మాట ఇప్పుడు కాస్త జ్ఞానం కలిగిన ప్రతీ ఒక్కరికి తెలిసిన పదం. సంచలన దర్శకుడు సినిమాలతో సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇవ్వాల్సిన రాం గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మొదలుకొని స్కూల్ పిల్లల వరకు నిద్ర లేస్తే ఓపెన్ చేసే సైట్ పోర్న్ సైట్స్. అంతలా దిగజారిపోయింది మన సమాజం. మన దేశంలో దీని మీద నిషేధం ఉన్నా ఇంటర్నెట్ లో ఈ కామ క్రీడలను చూసే వారు కోట్ల మందే ఉన్నారు. పోర్న్ చూడనిదే నిద్రపోని వారు కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఆంక్షలున్నా చూడడం నేరమైనా.. విదేశాల్లో పోర్న్ ఇండస్ట్రీ ఒక పరిశ్రమగా ఉందంటే అదేమంత గొప్ప విషయం కాదు.. శృంగార చిత్రాలలో నటించే హీరోయిన్లు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారున్నారు. వారి సంపాదన కోట్లలోనే ఉందంటే ఎవరికి నమ్మశక్యంగా అనిపించదు..? కానీ ఇదీ నిజం..నమ్మి తీరాల్సిందే.

 

సన్నీ లియోన్. ఒకప్పుడు విదేశాల్లో పాపులర్ పోర్న్ స్టార్ అన్న విషయం స్కూల్ పిల్లవాడి దగ్గర్నుంచి అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లోకి వచ్చి శృంగారభరిత చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యారు. ఆమె పోర్న్ స్టార్ గా ఉన్నప్పుడు ఆమె సంపద విలువ అక్షరాల 25 లక్షల అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాల 17 కోట్ల 82 లక్షలు. శృంగార తారలు సీన్ల లెక్కనే డబ్బులు తీసుకుంటారు. టాప్ పోర్న్ స్టార్ లు ఒక్క సీన్ కు 700 నుంచి 2500 డాలర్ల వరకూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారట. 6000 డాలర్లు తీసుకునే వారు ఉన్నాన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. మన కరెన్సీలో దాదాపు 50వేలు ఒక సీన్ కు తీసుకుంటారన్న మాట.. ప్రపంచంలో ఉన్న టాప్ పోర్న్ స్టార్ లు వారి ఆదాయాన్ని చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే.

 

జెన్నా జేమ్ సన్.. ప్రపంచంలోనే నంబర్ 1 పోర్స్ స్టార్ గా ఈమె గుర్తింపు పొందారు. క్వీన్ ఆఫ్ పోర్న్ అని ఈమెను పిలుస్తారు. మోస్ట్ ఫేమస్ పోర్న్ ఎంటర్ టైనర్ ఈమె. జెన్నా సంవత్సర ఆదాయం ఏకంగా.. 3 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో 213 కోట్లు. ప్రపంచంలోనే పోర్న్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తోంది. జెన్నా సంపాదన ముందు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఉన్న్ స్టార్లందరూ తమ సంపాదనలో ఏమాత్రం పనికిరారు.

 

ఇక మరో టాప్ పోర్న్ స్టార్ టెర్రా పాట్రిక్. ఈమె ప్రపంచంలోనే జెన్నా తర్వాత నంబర్ 2 పోర్న్ స్టార్. ఈమె సంవత్సర సంపాదన విలువ 1.15 కోట్ల డాలర్లు. ఆ తర్వాత స్థానంలో జెస్సీ జానే.. ప్రపంచంలోనే మూడో టాప్ మోస్ట్ పోర్న్ స్టార్. ఈ పోర్న్ స్టార్ సంపాదన 80 లక్షల డాలర్లు. నెక్స్ట్ మరో పోర్న్ స్టార్ బీ ఓలన్స్ టాప్ నాలుగో పోర్న్ స్టార్. ఈమె సంపాదన విలువ 50లక్షల డాలర్లు. ఆ తర్వాత జెన్నా హజె.. టాప్ 5 పోర్న్ స్టార్. సంపాదన విలువ 37 లక్షల డాలర్లు సంపాదిస్తోంది. ఇక మరో పోర్న్ స్టార్ సాషా గ్రే.. 18 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ పోర్న్ స్టార్. సంపాదన విలువ 30లక్షల డాలర్లు. ఇక మనందరికి తెలిసిన వెరీ ఫేమస్ పోర్న్ స్టార్ సన్నీ లీయోన్.. ఈమె బాలీవుడ్ సినిమాల్లోకి వచ్చి పోర్న్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయినా టాప్ పోర్న్ స్టార్ సంపాదనలతో పోలిస్తే ఈమె సంపద విలువ 25 లక్షల డాలర్లుగా ఉంది. ఇక లిసా యాన్ అనే మరో పోర్న్ స్టార్ సంపాదన విలువ 20లక్షల డాలర్లు ఉండగా.. ఎసా అకిరా 15లక్షల డాలర్లు, నిక్కీ బెంజ్ 10లక్షల డాలర్లు సంపాదిస్తూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.

 

ఇలా టాప్ పోర్న్ స్టార్ల సంపాదన కళ్లు బైర్లు కమ్మే లెవల్లో ఉంటూ... సినీ తారలకు ఏమాత్రం తీసిపోకుండా పోర్న్ రంగంలో టాప్ స్టార్లుగా వీరు కొనసాగుతున్నారు. అయితే సంవత్సరాలుగా ఈ పోర్న్ సీట్స్ ని బ్యాన్ చేయాలంటున్నా ఎందుకనో అది కుదరడం లేదు. పుట్ట గొడుగుల్లా కొన్ని వేలల్లో ఉన్న ఈ పోర్న్ సైట్స్ వల్లే సమాజం లో లెక్కకు మించి అరాచకాలు అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని కొన్ని వేల మంది వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: